రిలయన్స్ జియో టాప్ గేరులో దూసుకెళ్తోంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. వొడాఫోన్ ఐడియా కంపెనీని వెనక్కునెట్టి అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా గతంలో ఎయిర్‌టెల్ అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండేది. తర్వాత వొడాఫోన్, ఐడియా విలీనంతో వొడాఫోన్ ఐడియా కంపెనీ టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఎయిర్‌టెల్ రెండో స్థానానికి వచ్చింది. అప్పుడు జియో మూడో స్థానంలో ఉండేది. కానీ జియో స్పీడ్ పెంచింది. ఇటీవలనే ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు ఏకంగా టాప్ స్థానాన్ని దక్కించుకుంది.