IIT Topper Story: రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. ఈ IIT టాపర్ అలా ఎందుకు చేశాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Inspirational Success Story: వివేక్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. విజయాన్ని ఎప్పుడూ మనం సంపాదించే డబ్బుతో కొలవలేమని, జీవితంలో మనం ఎంచుకునే వ్యక్తులు, నిర్ణయాలతో కూడా కొలుస్తామని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో వివేక్ తీసుకున్న నిర్ణయం అతనికి దక్కాల్సిన ప్రశంసలన్నింటికీ అర్హమైనది...

IIT Topper Story: రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. ఈ IIT టాపర్ అలా ఎందుకు చేశాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Inspirational Success Story

Updated on: Jul 05, 2026 | 8:36 AM

Inspirational Success Story: మీకు అమెరికా నుండి సంవత్సరానికి రూ.3 కోట్ల జీతంతో ఉద్యోగ ఆఫర్ వచ్చింది.. కానీ మీరు దాన్ని తిరస్కరించి, ఒక చిన్న పట్టణంలో కిరాణా దుకాణం పెట్టారు. సహజంగానే మీ చుట్టూ ఉన్నవారికి ఈ నిర్ణయం అస్సలు నచ్చదు. పైగా మిమ్మల్ని పిచ్చివాడని కూడా అంటారు. కాన్పూర్‌కు చెందిన ఈ యువకుడి విషయంలో ఇలాంటి ఘటనే జరిగింది. అతను ఐఐటి బొంబాయి నుండి. అది కూడా గోల్డ్ మెడలిస్ట్‌గా పట్టభద్రుడయ్యాడు. అతనికి అమెరికా నుండి దాదాపు రూ.3 కోట్ల విలువైన ఉద్యోగ ఆఫర్ వచ్చింది. కానీ అక్కడికి విమానంలో వెళ్లకుండా తన సొంత ఊరిలోనే ఉండి ఒక చిన్న కిరాణా దుకాణం నడపడానికే అతను ఇష్టపడ్డాడు. దీని వెనుక ఉన్న కారణం కోసం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.

ఇది కాన్పూర్‌ నివాసి అయిన వివేక్ శర్మ కథ. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ప్రకారం, వివేక్ శర్మ ఐఐటి బొంబాయి నుండి బి.టెక్ కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. తన చదువు పూర్తి చేసిన తర్వాత అతనికి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ నుండి $240,000 (దాదాపు రూ. 290 మిలియన్లు) విలువైన ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్‌లో వీసా స్పాన్సర్‌షిప్, రీలోకేషన్ ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్త కెరీర్‌ను నిర్మించుకునే అవకాశం ఉన్నాయి.

వివేక్ శర్మ కాన్పూర్‌లోని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి రైల్వే క్లర్క్. తల్లి కుటుంబాన్ని పోషించడానికి ట్యూషన్ చెప్పేది. తనకు మంచి విద్యను అందించడానికి తన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని వివేక్ చెబుతున్నాడు. అతని చదువు కోసం వారు తమ పొదుపు, నగలు, డబ్బు మొత్తం ఖర్చు చేశారు. ఐఐటీలో ప్రవేశం లభించడానికి ముందు కోటాలో వసతి కోసం కూడా వారు చాలా డబ్బు ఖర్చు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ప్రకారం, వివేక్ అమెరికాకు వెళ్లేలోపే పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోయాయి. అతని తండ్రికి గుండెపోటు రాగా, తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఊహించని సంక్షోభాన్ని తట్టుకోవడానికి విదేశాల్లో కెరీర్ కొనసాగించడం కంటే కాన్పూర్‌లోనే ఉండటం మంచిదని అతను నిర్ణయించుకున్నాడు. తన తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండటం ఉత్తమమని భావించి, తన పోషణ కోసం ఒక కిరాణా దుకాణాన్ని తెరిచాడు. అంతేకాకుండా, పేద పిల్లలకు కోడింగ్ నేర్పించడం కూడా ప్రారంభించాడు. అయితే ఎంతో కష్టపడి జీవితంలో సక్సెస్‌ అవుతున్నప్పటికీ చివరకు కోట్ల ప్యాకేజీని వదులకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సోషల్‌ మీడియాలో ప్రశంసలు:

వివేక్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. విజయాన్ని ఎప్పుడూ మనం సంపాదించే డబ్బుతో కొలవలేమని, జీవితంలో మనం ఎంచుకునే వ్యక్తులు, నిర్ణయాలతో కూడా కొలుస్తామని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో వివేక్ తీసుకున్న నిర్ణయం అతనికి దక్కాల్సిన ప్రశంసలన్నింటికీ అర్హమైనది. “నిజమైన విజయాన్ని డబ్బుతో కాదు, కుటుంబంతో కొలవాలి” అని మరో వినియోగదారు కామెంట్‌ చేశాడు. వివేక్ తీసుకున్న నిర్ణయాలు ఇతరులకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us