Realme Ac: Realme కేవలం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను అందించడమే కాదు ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్తరకం ఏసీలని కూడా విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లను అందిస్తుంది. ఇప్పుడు తాజాగా ఎయిర్ కండీషనర్ స్పేస్‌లోకి ప్రవేశించింది. స్ప్లిట్ లేదా కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్‌లను 3 మోడళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ధర రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని ఏసీ మోడల్స్ తెలుపు రంగులోనే ఉంటాయి. Realme కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్ల కొత్త శ్రేణి 1 టన్ను, 1.5 టన్ను సామర్థ్యాలలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఫోర్ స్టార్ రేటింగ్‌తో 1 టన్ను సామర్థ్యం ఉన్న మోడల్ ధర రూ.27,790 కాగా, ఫోర్ స్టార్ రేటింగ్‌తో 1.5 టన్ను మోడల్ ధర రూ.30,999గా ఉంది. ఫైవ్ స్టార్ 1.5 టన్ను మోడల్ రూ.33,490కి అందుబాటులో ఉంది.
ఈ Realme ACలు గదిలోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా కూలింగ్ కెపాసిటీని మార్చగలదు. గదిలో సరైన ఉష్ణోగ్రతను నిర్ధారిస్తుంది. ఇది ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది వేగవంతమైన కూలింగ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇవి 55 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత వద్ద కూడా గదిని చల్లబరుస్తాయి. ఈ ఏసీలు ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్‌తో వస్తాయి. ఎయిర్ కండీషన్‌ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆటో క్లీన్ ఫీచర్ 30 సెకన్ల పాటు పని చేస్తుంది. ఈ యంత్రాలు డ్రై, ఎకో, త్రీ స్లీప్ వంటి మోడ్‌లను అందిస్తాయి. పవర్ కట్ తర్వాత సెట్టింగ్స్‌ను మాన్యువల్‌గా రీసెట్ చేయనవసరం లేదు. ఈ ఎయిర్ కండీషనర్లన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.