
కాయిన్‌కు రెండు వైపులు అన్నట్లు.. డిజిటల్ చెల్లింపులతో ఎంత సౌకర్యం ఉందో, అంతే ప్రమాదం కూడా ఉంది. కేవలం నగదు మాత్రమే చెలామణిలో ఉన్నప్పుడు దొంగతనాలు, దోపిడీలు జరిగిన సమయంలో ప్రజలు ఆర్థిక నష్టాలను చవిచూసేవారు. కానీ డిజిటిల్ చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత సైబర్ మోసాలతో నొప్పి తెలియకుండా నిమిషాల్లోనే చాలా డబ్బు నష్టపోతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్‌కు వృద్ధులే ఎక్కువగా బలవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ మోసానికి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో మోసగాళ్ళు సీనియర్ సిటిజన్ల భయం, సాంకేతిక అసౌకర్యం, నమ్మకాన్ని ఉపయోగించుకుని వారి జీవిత పొదుపును నిమిషాల్లో దోచుకున్నారు. అనేక సంఘటనలు చాలా తీవ్రంగా ఉన్నాయి, మోసానికి గురైన వృద్ధులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు.
ఇప్పుడు పెరుగుతున్న ఈ ముప్పు దృష్ట్యా, డిజిటల్ చెల్లింపులలో డబ్బు కోల్పోయిన కస్టమర్లకు ఆర్థిక ఉపశమనం అందించడం గురించి RBI మాట్లాడింది. వృద్ధులకు డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా ఉంచాలని కూడా సూచించింది. ఫిబ్రవరిలో జరిగిన RBI MPC సమావేశంలో చిన్న-విలువ మోసపూరిత లావాదేవీలకు వినియోగదారులకు రూ.25,000 వరకు పరిహారం చెల్లించవచ్చని ప్రతిపాదించారు. డిజిటల్ మోసానికి గురైన బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించడానికి, వ్యవస్థపై విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇది ఉద్దేశించబడింది. డిజిటల్ మోసం వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ RBI నిర్ణయం పెద్ద రిలీఫ్‌ను అందిస్తుంది.
డిజిటల్ మోసగాళ్ళు తరచుగా సీనియర్ సిటిజన్లను బ్యాంకు అధికారులు, పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థలుగా నటిస్తూ బెదిరిస్తారు. కొన్నిసార్లు KYC అప్డేట్ల ముసుగులో లేదా కొన్నిసార్లు వారి ఖాతాలను బ్లాక్ చేస్తామని బెదిరించడం ద్వారా, వారు OTP లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహిస్తారు. సీనియర్ సిటిజన్లకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, భయపడే ధోరణి వారిని సులభంగా మోసగాళ్లకు గురి చేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి