FD Interest Rates: ఎఫ్‌డీ ఖాతాదారులకు షాక్ తప్పదా? త్వరలో రేట్లు ఢమాల్!

|

Aug 17, 2024 | 3:28 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటును కొనసాగించినప్పటికీ భవిష్యత్తులో నిర్ణయం మారవచ్చు. వడ్డీ రేటు తగ్గింపుల చక్రాన్ని ప్రారంభించే అవకాశం ఉండవచ్చు. ఇదే జరిగితే ఎఫ్‌డీ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎఫ్ డీలపై వడ్డీ రేటు బాగుండడంతో రాబడి బాగానే ఉంది.

FD Interest Rates: ఎఫ్‌డీ ఖాతాదారులకు షాక్ తప్పదా? త్వరలో రేట్లు ఢమాల్!
Fd Interest Rates
Follow us on

బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది. వాటిలో తమ డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. నిర్ధిష్ట సమయానికి వడ్డీతో అసలు తీసుకునే అవకాశం ఉండడం మరో కారణం. బ్యాంకులలో సొమ్ములకు పూర్తి భద్రత ఉండడంతో ఎఫ్ డీ పథకాలకు ఆదరణ పెరుగుతోంది. వీటిపై వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ అందిస్తారు. గత ఒకటి, రెండు ఏళ్లలో ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడి దారులకు మంచి రాబడిని అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పాత రెపోరేటునే కొనసాగించడం దీనికి కారణం. అయితే ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు ఇలాగే కొనసాగుతాయా, లేకపోతే భవిష్యత్తులో తగ్గిపోతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఆశాజనకం..

ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులు అధిక వడ్డీ రేట్టు పొందుతున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్తులో రేట్ల తగ్గింపులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతాయి. డిపాజిట్ల రేట్లను సర్దుబాటు చేయడంలో బ్యాంకులు నిదానంగా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడిదారులు ప్రస్తుత ఉన్న అధిక రేట్లతో దీర్ఘకాలిక ఎఫ్ డీలను ఎంపిక చేసుకోవడం ఉపయోగంగా ఉంటుంది.

భవిష్యత్తులో మారే అవకాశం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటును కొనసాగించినప్పటికీ భవిష్యత్తులో నిర్ణయం మారవచ్చు. వడ్డీ రేటు తగ్గింపుల చక్రాన్ని ప్రారంభించే అవకాశం ఉండవచ్చు. ఇదే జరిగితే ఎఫ్‌డీ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎఫ్ డీలపై వడ్డీ రేటు బాగుండడంతో రాబడి బాగానే ఉంది. కానీ ఈ విధానం రానున్న రోజుల్లో రాకపోయే అవకాశం కూడా ఉంది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు..

ఈ విషయంలో పలువురు ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటి ప్రకారం.. స్థిరమైన ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఏదైనా రేటు తగ్గింపులను పరిగణనలోకి తీసుకోవడానికి ఆర్‌బీఐకి కొంత వెసులుబాటు ఉంది. అయితే పాలసీ రేటు తగ్గింపులు త్వరలో ప్రారంభమైనప్పటికీ, బ్యాంకులు తమ ఎఫ్ డీ రేట్లను తగ్గించడానికి కొంత సమయం తీసుకుంటాయి. ఇటీవల క్రెడిట్‌తో పోలిస్తే బ్యాంక్ డిపాజిట్లు నెమ్మదిగా పెరిగాయి. అనేక బ్యాంకులు ఇప్పటికీ పొదుపు డిపాజిట్లపై దాదాపు 3 శాతం వడ్డీని అందిస్తున్నాయి. దీర్ఘకాలిక డిపాజిట్ల కోసం కూడా అలాగే ఉంది. మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాబట్టి భవిష్యత్తులో బ్యాంకులు డిపాజిట్ రేట్లను గణనీయంగా తగ్గించడం అసంభవంగా కనిపిస్తోంది.

త్వరలో వెల్లడి..

మరో ఆర్థిక నిపుణుడి అభిప్రాయం పైన చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే కఠినమైన లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటున్న కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను ఆకర్షించడానికి ఎఫ్ డీలపై వడ్డీ రేట్లను పెంచుతాయని ఆయన వాదన. ఏది ఏమైనా భవిష్యత్తులో ఎఫ్ డీ వడ్డీ రేట్లలో గణనీయమైన తగ్గుదల ఉండకపోవచ్చు. కానీ వడ్డీ రేటు తగ్గింపు చక్రం ప్రారంభమైంది. రాబోయే 9 -12 నెలల్లో దీని ప్రభావం పడుతుంది.

అప్రమత్తం..

ఫిక్స్ డ్ డిపాజిట్ దారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నా, మీ పాత ఎఫ్ డీ తొందరలో మెచ్యూర్ అవుతున్నా ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్లకు లాక్ చేయాలి. భవిష్యత్తులో తగ్గే అవకాశం, ప్రస్తుతం ఉన్నయథాతథ స్థితిని అంచనా వేయాలి. ఏది ఏమైనా ఫ్లోటర్ కంటే ఫిక్స్‌డ్ రేట్ ప్రతిపాదనలే మనకు అనుకూలంగా ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లను అందించే దీర్ఘకాలిక ఎఫ్ డీలలో మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడి పెట్టాలి. అలాగే మీ లిక్విడిటీ అవసరాలను తీర్చడం కోసం కొంత భాగాన్ని చిన్న, మధ్యస్థ ఎఫ్ డీలతో డిపాజిట్ చేయడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..