మళ్లీ హోమ్ లోన్లపై వడ్డీ రేటు పెరగనుందా? రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం అధికం కానుందా? అంటే అవుననే సమాధానమే మార్కెట్ వర్గాల నుంచి వస్తోంది. పార్లమెంట్ లో యూనియన్ బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపోరేటును 25 బేస్ పాయింట్లు(బీపీఎస్) పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుకు జరిగితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ రేట్లు రెండూ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు మే నుంచి ఆర్‌బీఐ పాలసీ ఫలితాలకు అనుగుణంగా తమ ఎఫ్‌డి రేట్లను పెంచుతాయి. అలాగే పలు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అంచనాలు ఇలా ఉంటే.. హోమ్ లోన్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దాని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశీయ అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ ముగిసినప్పటికీ క్యాంపెయిన్ రేట్స్ పేరుతో ప్రత్యేకంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లపై 30 నుంచి 40 బేస్ పాయింట్ల(బీపీఎస్) రాయితీని అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త ఆఫర్ కింద కస్టమర్‌లకు సాధారణ గృహ రుణాలపై ఎస్‌బీఐ 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే ఇది వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా మారుతుంది.
ఎస్బీఐ హోమ్ లోన్లపై అధికమైన రాయితీలను అందిస్తోంది. ప్రతి లోన్ పై దాదాపు 30 నుంచి 40 బేస్ పాయింట్లు తగ్గించి వడ్డీ రేటు అందిస్తోంది. ఈ రాయితీలు అన్నీ కూడా సిబిల్ స్కోర్ 700 నుంచి 800 వరకూ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి.
మహిళలు గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపును పొందుతారు. జీతం ఖాతాదారులు ప్రివిలేజ్, అపోన్ ఘర్ పథకాలపై 5 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపును పొందుతారు.
రక్షణ సిబ్బందికి శౌర్య, శౌర్య ఫ్లెక్సీ ఉత్పత్తుల కింద అందించే గృహ రుణ రేట్లపై 10 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపు లభిస్తుంది.
అదేవిధంగా కాంపెయిన్ రేట్స్ ఆఫర్ కింద హోమ్ లోన్, టాప్ అప్ లోన్‌ల ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌బీఐ పండుగ హోమ్ లోన్ ఆఫర్ జనవరి 31తో ముగుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..