RBI Gold: ఇంట్లో పడి ఉన్న బంగారంతో ‘గోల్డెన్’ ఆదాయం.. ఆర్‌బీఐ మాస్టర్ ప్లాన్! అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే?

RBI Gold Monetisation Scheme: ఈ పథకంలో చేరే ముందు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు డిపాజిట్ చేసిన నగలను పూర్తిగా కరిగించి ముద్దగా మారుస్తారు. అందుకే మెచ్యూరిటీ తర్వాత మీకు అదే డిజైన్ ఉన్న నగలు తిరిగి రావు..

RBI Gold: ఇంట్లో పడి ఉన్న బంగారంతో గోల్డెన్ ఆదాయం.. ఆర్‌బీఐ మాస్టర్ ప్లాన్! అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే?
Gold Monetisation Scheme

Updated on: May 18, 2026 | 12:27 PM

RBI Gold Monetisation Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నేతృత్వంలో నడుస్తున్న గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme – GMS) ద్వారా ఇంట్లో లేదా బ్యాంక్ లాకర్లలో ఊరికే పడి ఉన్న బంగారంపై ప్రతి ఏటా వడ్డీ రూపంలో ఆదాయాన్ని ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం. ఈ పథకం పూర్తి వివరాలు, నిబంధనలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ అంటే ఏమిటి?

భారతీయ కుటుంబాల వద్ద, ట్రస్టుల వద్ద వృథాగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా దేశీయంగా బంగారపు దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మనం బ్యాంకులో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసి వడ్డీ పొందినట్లే, మన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా డిపాజిట్ చేసి వడ్డీ సంపాదించవచ్చు.

1. ఎవరు డిపాజిట్ చేయవచ్చు?

భారతదేశ పౌరులు (వ్యక్తులు), హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), మ్యూచువల్ ఫండ్స్, వివిధ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన లేదా ధార్మిక ట్రస్టులు ఈ స్కీమ్‌లో బంగారాన్ని డిపాజిట్ చేయడానికి అర్హులు.

ఇవి కూడా చదవండి

కనీస పరిమితి:

కనీస బరువు: ఈ స్కీమ్‌లో చేరడానికి కనీసం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ (సమానమైన బంగారం) ఉండాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు మీ వద్ద ఉన్న నాణేలు (Coins), బిస్కెట్లు/బార్లు (Bars) లేదా నగల (Jewellery) రూపంలో ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు. (ఒకవేళ నగలలో విలువైన రత్నాలు, రాళ్లు ఉంటే వాటిని వేరు చేసి తిరిగి ఇచ్చేస్తారు).

ఇది కూడా చదవండి: Gold Price: ఇది కదా కావాల్సింది.. 4 గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం ధర..!

3. వడ్డీ రేట్లు, కాలపరిమితి

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ స్కీమ్‌లో ప్రధానంగా షార్ట్ టర్మ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. 1 నుండి 3 సంవత్సరాల కాలపరిమితితో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. సాధారణంగా బ్యాంకులు ఈ డిపాజిట్లపై ప్రతి ఏటా 2% నుండి 2.5% వరకు వడ్డీని అందిస్తాయి.

4.మెచ్యూరిటీ తర్వాత రిటర్న్స్

మీ డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత (Maturity), మీరు డిపాజిట్ చేసిన నాటి బంగారపు బరువుకు సమానమైన భౌతిక బంగారాన్ని లేదా ఆ సమయానికి మార్కెట్లో ఉన్న ధర ప్రకారం నగదును వెనక్కి తీసుకోవచ్చు.

ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?

ప్యూరిటీ టెస్టింగ్: మొదటగా వ్యక్తి తన బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫైడ్ టెస్టింగ్ సెంటర్‌కు (CPTC) తీసుకువెళ్లాలి.
కరిగించడం: అక్కడ బంగారం స్వచ్ఛతను పరీక్షించడానికి నగలను లేదా బంగారాన్ని కరిగిస్తారు.
గోల్డ్ అకౌంట్ క్రెడిట్: బంగారం కరిగించిన తర్వాత వచ్చిన నికర స్వచ్ఛమైన గోల్డ్ (Net Fine Gold) బరువుకు సమానమైన మొత్తాన్ని మీ పేరిట తెరిచిన ‘గోల్డ్ సేవింగ్స్ అకౌంట్’ లో డిజిటల్‌గా క్రెడిట్ చేస్తారు. ఆ బరువు ఆధారంగానే మీకు వడ్డీ లెక్కిస్తారు.

ఇది కూడా చదవండి: Lizards: ఇంట్లో బల్లుల బెడదతో విసిగిపోయారా? ఈ మ్యాజిక్ స్ప్రేతో క్షణాల్లో మాయం!

పన్ను ప్రయోజనాలు:

  • ఈ పథకంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ పన్ను మినహాయింపు.
  • ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయ పన్ను) కట్టాల్సిన అవసరం లేదు.
  • మెచ్యూరిటీ సమయంలో బంగారం ధర పెరిగినా కూడా దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి పూర్తి మినహాయింపు ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం:

ఈ పథకంలో చేరే ముందు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు డిపాజిట్ చేసిన నగలను పూర్తిగా కరిగించి ముద్దగా మారుస్తారు. అందుకే మెచ్యూరిటీ తర్వాత మీకు అదే డిజైన్ ఉన్న నగలు తిరిగి రావు. కేవలం ప్యూర్ గోల్డ్ లేదా క్యాష్ మాత్రమే వస్తుంది. అందువల్ల, సెంటిమెంట్ ఉన్న పాత నగల కంటే, ఇంట్లో వాడకుండా ఊరికే పడి ఉన్న విరిగిన నగలు, కాయిన్స్ లేదా గోల్డ్ బార్స్ ఉన్నవారికి ఈ స్కీమ్ ఒక అద్భుతమైన ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Bakrid 2026 Date: భారత్‌లో బక్రీద్‌ పండుగ ఎప్పుడు? తేదీపై స్పష్టత ఇచ్చిన ఇస్లామిక్ పండితులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us