Raymonds realty limited: రేమండ్‌ నుంచి మరో కొత్త కంపెనీ.. వాటాదారులకు ఎంత లాభమంటే..?

ప్రముఖ టెక్స్‌టైల్స్‌ వ్యాపార దిగ్గజం రేమండ్ కంపెనీ గురించి మన దేశంలో ప్రత్యేకంగా చెప్పనప్పసరం లేదు. ఈ సంస్థ తయారు చేసిన వస్త్రాలకు ఎంతో డిమాండ్‌ ఉంటుంది. హుందాతనానికి, స్టైల్‌కు ప్రతీకగా రేమండ్‌ వస్త్రాలు నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రియల్టీ బిజిసెస్‌ విభాగాన్ని విడదీసి ప్రత్యేక విభాగంగా తయారు చేసింది. అంటే రేమండ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎల్‌) నుంచి రేమండ్‌ రియల్టీ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌ఎల్‌) విడిపోతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎల్‌ షేర్‌ హోల్డర్లకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Raymonds realty limited: రేమండ్‌ నుంచి మరో కొత్త కంపెనీ.. వాటాదారులకు ఎంత లాభమంటే..?
Stock Market

Updated on: May 13, 2025 | 2:40 PM

రేమండ్‌ లిమిటెడ్‌ కంపెనీ తనలోని రియల్టీ బిజినెస్‌ విభాగాన్ని రేమండ్‌ రియల్టీ లిమిటెడ్‌ అనే పేరుతో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనికి కంపెనీ బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. 2025 మే ఒకటి నుంచి ఈ డీమెర్జర్‌ అమల్లోకి వచ్చింది. దీంతో రేమండ్‌ రియల్టీ లిమిటెడ్‌ షేర్లు బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంచ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లలో జాబితా చేయబడతాయి. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కూడా ఈ డీమెర్జర్‌ను ఆమోదించింది. రేమండ్‌ లిమిటెడ్‌ తీసుకున్న నిర్ణయంతో వాటాదారులకు మరింత లాభం కలుగుతుందని కంపెనీ చెబుతోంది. దేశ ప్రాపర్టీ మార్కెట్‌లో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లు జారీ చేస్తారు. అంటే రేమండ్‌ లిమిటెడ్‌లో వాటాదారులకు ఒక్క షేర్‌కు రేమండ్‌ రియల్టీ షేరును కేటాయిస్తారు.

రేమండ్‌ లిమిటెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అనేక బలమైన కారణాలున్నాయి. వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించే విధానంలో భాగంగా ఈ డీమెర్జర్‌ జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రేమండ్‌ లిమిటెడ్‌ మొత్తం ఆదాయంలో రియల్టీ వ్యాపారం దాదాపు 24 శాతం వాటా ఉంది. 2023-24లో విడిగా 43 శాతం వృద్ధితో సుమారు రూ.1,593 కోట్ల టర్నోవర్‌ సంపాదించింది. డీమెర్జర్‌కు సంబంధించి రేమండ్‌ లిమిటెడ్‌ వాటాదారులకు రేమండ్‌ రియల్టీ 6,65,73,731 ఈ‍క్విటీ షేర్లను జారీ చేయనుంది.

రియల్‌ వ్యాపారంలో మరింత ప్రగతి సాధించడం, కొత్త పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి రేమండ్‌ రియల్టీ లిమిడెట్‌ అ‍త్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. రేమండ్‌ రియల్టీ విభాగానికి థానేలో సుమారు వంద ఎకరాల భూమి ఉంది. మరో 40 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ సుమారు రూ.9 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వాటి నుంచి రూ 16 వేల కోట్లకు పైగా ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. గతంలో కూడా రేమండ్‌ తన హోటల్‌ విభాగాన్ని విడదీసి ప్రత్యేక సంస్థగా తయారు చేసింది. తాజాగా రియల్టీ విభాగాన్ని కూడా వేరు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి