Ratan TATA: దేశంలో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఆదర్శం. టాటా సన్స్ గౌరవ చైర్మన్, టాటా ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న రతన్ టాటా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండే రతన్ టాటా.. వ్యాపారం విషయంలో మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా స్పష్టతతో వ్యవహరిస్తుంటారు.
టాటా గ్రూప్స్ ఎంత పెద్దవి అయినా అప్‌కమింగ్ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ భవిష్యత్తును ముందుగానే అంచనా వేస్తారు. ఇప్పటికే పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి రతన్ తాజాగా మరో స్టార్టప్ కంపెనీలు పెట్టుబడులు పెట్టారు. తాజాగా ప్రీతిష్ నందీ కమ్యూనికేషన్స్‌లో రతన్‌టాగా వాటాలు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ప్రీతిష్ నందీస్ నందీస్ కమ్యూనికేషన్స్ సోమవారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఎంత వాటా కొనుగోలు చేశారు లాంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రతన్ టాటా ఆయన వ్యక్తిగత హోదాలో ప్రీతిష్ నందీ కమ్యూనికేషన్స్‌లో వాటాలు కోనుగోలు చేశారు. ఇక ఈ విషయం బయటకు తెలియడంతో కంపెనీ షేర్ 9.81 శాతం ఎక్కువగా ట్రేడ్ అయ్యింది. ఇదిలా ఉంటే 1993లో ఏర్పాటు చేసిన ప్రితీశ్ నందీ కమ్యూనికేషన్స్ టీవీ కంటెంట్ అందించే సంస్థగా ఏర్పాటైంది. అనేక వార్త, వినోద కార్యక్రమాల్ని నిర్వహించిన ఈ కంపెనీ 2000లో ఐపీవోకి వచ్చింది.
Also Read: Honda CB 500X: కొత్త అడ్వెంచర్ బైక్‌ను లాంచ్ చేసిన హోండా… ధర ఎంతో తెలిస్తే అవాక్కావ్విల్సిందే..