
గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న రాప్టీ ఎలక్ట్రిక్ బైక్ త్వరలో మన దేశ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం క్రితమే రాప్టీ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ను ప్రకటించింది. అది కూడా పూర్తి ట్రాన్స్ పరెంట్(పారదర్శక) బాడీతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ ఇది. దీనిపై చాలా అంచనాలున్నాయి. ఈ ఉత్పత్తి కోసం కంపెనీ చాలా కష్టపడింది. కేవలం ఆర్ అండ్ డీ పైనే ఇది ఐదేళ్లు శ్రమ పడింది. హై ఓల్టేజ్ పవర్ డ్రెయిన్ తో కూడిన బైక్ ను తయారు చేయడమే కాకుండా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలోనే దీనిని చార్జ్ చేసుకునే వెసులుబాటును అందిస్తోంది. ఈ బైక్ లైఫ్ స్పాన్ 10 నుంచి 12 ఏళ్లు ఉంటుంది. కాగా ఈ బైక్ ను ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదల చేసేందుకు రాప్టీ సన్నాహాలు చేస్తోంది. అన్ని కుదిరితే 2024, జూన్ లోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని మొట్టమొదటి సారిగా జనవరిలో తమిళనాడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రదర్శించారు.
రాప్టీ ఎనర్జీ కో ఫౌండర్ అండ్ సీఈఓ డినేష్ అర్జున్ మాట్లాడుతూ తమ బైక్ ఏ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లో అయినా చార్జ్ చేసుకునే సదుపాయం కలిగి ఉంటుందని ఇదే తమకు మార్కెట్లో అనుకూలిస్తుందని చెప్పారు. మార్కెట్లో 2 వాట్ల సింగిల్ చార్జింగ్ స్టాండర్డ్(సీసీఎస్2) చార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని తెలిపారు. మన దేశంలో ఈ సదుపాయం కలిగిన ఏకైక కంపెనీ తమదేనని చెప్పారు. అలాగే ఇంటి దగ్గర చార్జింగ్ సమయం కూడా చాలా తక్కువని కేవలం 45 నిమిషాల్లోనే సున్నా నుంచి 80శాతం చార్జ్ అవుతుందని ఆయన వివరించారు.
అంతేకాక రాప్టీ ట్రాన్స్ పరెంట్ బైక్ అనేది ఈ సింగిల్ చార్జింగ్ స్టాండర్డ్(సీసీఎస్2) అడాప్ట్ చేసుకున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్ అని డినేష్ చెప్పారు. అంతేకాక ఇది ఏసీ, డీసీ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుందన్నానరు. అందు కోసం ప్రత్యేకంగా సీసీఎస్2 కనెక్టర్ ఉంటుందని, అది వినియోగదారులకు కంపెనీ ఉచితంగా అందిస్తుందని చెప్పారు.
అన్ని కుదిరితే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లోనే ఈ రాప్టీ ట్రాన్స్ పరెంట్ బాడీ బైక్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 2.5లక్షల నుంచి రూ. 3లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లోని సంప్రదాయ పెట్రోల్ 250సీసీ ఇంజిన్ బైక్ లతో పోటీ పడుతుందని కంపెనీ ప్రకటించింది.
రానున్న ఆర్థిక సంవత్సరంలో 10,000 బైక్ లను తయారు చేసేలా ప్రణాళిక చేస్తోందని రాప్టీ ప్రకటించింది. వాటిల్లో సగం ఈ ఏడాదిలోనే ఉత్పత్తి చేయాలని చూస్తోంది. అంతేకాక 2025లో రాప్టీ నుంచి మరో బైక్ ను కూడా లాంచ్ చేసేందుకు ప్రణాళిక చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..