Tax Saving Tips: పన్ను పోటు నుంచి రక్షణ.. ఈ ఐదు టిప్స్‌తో బోలెడు సొమ్ము ఆదా..!

|

Jan 26, 2024 | 6:30 AM

పాత పన్ను విధానంలోని చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఉన్న వివిధ పన్ను ఆదా సాధనాల గురించి తెలుసు. అవి పన్నును చాలా ఆదా చేయడంలో సహాయపడతాయి. కానీ చాలా మంది ఈ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నా, కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు కంపెనీ వారికి పన్ను రుజువు సమర్పించడం కష్టంగా ఉంటుంది.

Tax Saving Tips: పన్ను పోటు నుంచి రక్షణ.. ఈ ఐదు టిప్స్‌తో బోలెడు సొమ్ము ఆదా..!
Income Tax
Follow us on

భారతదేశంలో పన్ను చెల్లింపుల హడావుడి స్టార్ట్‌ అయ్యింది. కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను రుజువును సమర్పించమని కోరడం స్టార్ట్‌ చేశాయి. పాత పన్ను విధానంలోని చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఉన్న వివిధ పన్ను ఆదా సాధనాల గురించి తెలుసు. అవి పన్నును చాలా ఆదా చేయడంలో సహాయపడతాయి. కానీ చాలా మంది ఈ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నా, కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు కంపెనీ వారికి పన్ను రుజువు సమర్పించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పన్ను ఆదాయ చేయడానికి నిపుణులు సూచించే మార్గాల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

ఇంటి అద్దె 

మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తుంటే ఒకవేళ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయలేకపోతే, మీరు మీ తల్లిదండ్రులకు అద్దె చెల్లించడం ద్వారా హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఏ) ప్రకారం మీరు మీ తల్లిదండ్రులను అద్దెదారులుగా చూపడం ద్వారా హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే మీరు ఏదైనా ఇతర గృహ పన్ను ప్రయోజనాన్ని తీసుకుంటే మీరు హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్ చేయలేరు.

రుణంపై వడ్డీ

మీ తల్లిదండ్రులు తక్కువ పన్ను పరిధిలో ఉంటే లేదా వారు పన్ను విధించకపోతే మీరు ఇంటి ఖర్చుల కోసం వారి నుంచి రుణం తీసుకొని దానిపై వడ్డీ చెల్లించవచ్చు. అయితే పన్ను మినహాయింపు పొందడానికి వడ్డీ చెల్లింపునకు సంబంధించి ధ్రువీకరించిన ధ్రువీకరణ పత్రాన్ని పొందడం మర్చిపోవద్దు. మీరు ఈ రుజువును అందించలేకపోతే మీకు పన్ను మినహాయింపు లభించదు. మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 24బి కింద ఈ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కింద గరిష్టంగా రూ. 2 లక్షల తగ్గింపును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రీ-నర్సరీ ఫీజులు

మీ పిల్లవాడు చిన్నవాడైతే అతను ప్లేగ్రూప్, ప్రీ-నర్సరీ లేదా నర్సరీలో ఉన్నప్పటికీ మీరు వారి ఫీజులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పన్ను ప్రయోజనం 2015లోనే అమలులోకి వచ్చినప్పటికీ స్కూల్ ట్యూషన్ ఫీజు తగ్గింపు కారణంగా ఇది ప్రజాదరణ పొందలేదు. మీరు సెక్షన్ 80సీ కింద, గరిష్టంగా ఇద్దరు పిల్లల ఫీజుపై ఈ మినహాయింపు పొందవచ్చు.

ఆరోగ్య బీమా

మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మీ పన్నులను ఆదా చేసుకోవచ్చు. మీరు మీ తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా తీసుకుంటే, మీరు ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు పొందుతారు. 65 ఏళ్లలోపు తల్లిదండ్రుల ఆరోగ్య బీమాపై రూ. 25,000 వరకు ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందుతారు. మీ తల్లిదండ్రుల వయస్సు 65 ఏళ్లు పైబడి ఉంటే మీరు రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు.

వైద్య ఖర్చులు

మీరు మీ తల్లిదండ్రుల వైద్య ఖర్చులపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, దీని కోసం మీ తల్లిదండ్రుల వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ వయస్సులో, వారు తరచుగా చాలా వైద్య ఖర్చులను భరించాల్సి ఉంటుంది, దానిపై మీరు సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కింద మీరు గరిష్టంగా రూ. 50,000 పన్ను మినహాయింపు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..