Bima Yojana: ఏడాదికి రూ. 20తో రూ. 2 లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలు..

|

Dec 16, 2023 | 5:38 PM

అయితే జీవిత బీమా అనగానే మనలో ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC). కానీ ఇందులో పాలసీ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో జీవిత బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉన్నవారు, ఉద్యోగులు మాత్రమే ఇలాంటి జీవిత బీమా స్కీమ్‌లను తీసుకుంటారు. మరి దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి.? ఇలాంటి వారి కోసమే.. కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో...

Bima Yojana: ఏడాదికి రూ. 20తో రూ. 2 లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలు..
Pm Suraksha Bima Yojana
Follow us on

PM Bima Yojana: ప్రస్తుతం ఆర్థిక విషయాలపై అందరిలో అవగాహన పెరుగుతోంది. దీంతో ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమ శిక్షణతో పాటు భవిష్యత్తు కార్యచరణపై ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూనే మరోవైపు జీవిత బీమా సైతం తీసుకుంటున్నారు. తమ తదనంతరం తమపై ఆధారపడిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లు తీసుకుంటున్నారు.

అయితే జీవిత బీమా అనగానే మనలో ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC). కానీ ఇందులో పాలసీ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో జీవిత బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉన్నవారు, ఉద్యోగులు మాత్రమే ఇలాంటి జీవిత బీమా స్కీమ్‌లను తీసుకుంటారు. మరి దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి.? ఇలాంటి వారి కోసమే.. కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పాలసీని తీసుకొచ్చింది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ జీవిత బీమా స్కీమ్‌ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లిస్తే చాలు, ఏకంగా రూ. 2 లక్షల బీమా కవరేజీ పొందొచ్చు. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2015లోనే ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ తీసుకున్న పాలసీదారుడు అకాల మరణం చెందిన, ఏదైనా ప్రమాదంలో పూర్తి స్థాయిలో వైక్యలం పొందినా కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు అందజేస్తారు.

18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ బీమా పథకంలో చేరొచ్చు. ఏడాదికి రూ. 20 ప్రీమియం చెల్లించాలి. మీరు సెలక్ట్‌ చేసుకున్న బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం ఆటోమెటిక్‌గా డిడక్ట్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు. ఆసక్తిఉన్న వారు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ లేదా మొబైల్ యాప్‌ ద్వారా పాలసీని తీసుకొచ్చు. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి ఈ పథకాన్ని తీసుకొచ్చిన సయంలో ప్రీమియం కేవలం రూ. 12గానే ఉండేది, అయితే ఆ తర్వాత రూ. 20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారు సమీపంలో ఉన్న ఏదైనా బ్యాంకును సంప్రదించవచ్చు. లేదా బ్యాంక్‌ మిత్రాస్‌ ఇంటి వద్దే సేవలు అందిస్తారు. పేద ప్రజలకు జీవిత బీమా అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..