సురక్షితమైన పెట్టుబడితో అధిక రాబడి ఆర్జించడంలో పోస్టాఫీస్ పథకాలకు పెట్టింది పేరు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రజల నుంచి వస్తున్న ఆదారణకు అనుగుణంగా పోస్టాఫీస్ కూడా పలు రకాల కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. పోస్టాఫీస్ అందిస్తున్న ఇలాంటి బెస్ట్ స్కీమ్స్‌లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటి.? దీనివల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..
రికరింగ్ డిపాజిట్ చేసే వారికి పోస్టాఫీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకంలో 5 ఏళ్లపాటు పెట్టుబడులు పెడితే మొదటి కంటే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. సెప్టెంబర్ 29, 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్ రికరింగ్ డిపాజిట్‌లపై వడ్డీ రేటను 20 బేసిస్ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే గతంలో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు.
రికరింగ్ డిపాజిట్ పథకం కింద దగ్గర్లోని పోస్టాఫీస్‌లో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్‌లో రూ. 100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేయవచ్చు. అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. డిపాజిట్ ప్రారంభించిన తర్వాత అకౌంట్ ఏడాది యాక్టివ్‌గా ఉంటే చాలు.. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతాన్ని రుణంగా తీసుకొవచ్చు. అయితే ఈ మొత్తానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ పథకంలో నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేశారనుకుందాం. దీంతో మీరు ఐదేళ్లలో మొత్తం రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తారు.
దీనిపై 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో మీకు వడ్డీ రూపంలో రూ. 56,830 జమ అవుతుంది. అంటే మీ మొత్తం ఫండ్ రూ. 3,56,830కి చేరుతుంది. ఇప్పుడు మీ ఖతాను మరో ఐదేళ్లు పొడగిస్తే.. మీరు పదేళ్లలో డిపాజిట్ చేసే మొత్తం రూ. 6,00,000కి చేరుతుంది. దీంతో మీ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీతో రూ. 2,54,271 లభిస్తుంది. ఇలా చూస్తే మీరు 10 ఏళ్లలో మీ అకౌంట్‌లో మొత్తం రూ. 8,54,272కి చేరుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..