రిస్క్ లేకుండా జస్ట్ వడ్డీతోనే 4.5లక్షల ఆదాయం.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసుకోండి..

రూపాయి నష్టం లేకుండా.. పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వ గ్యారెంటీతో భారీ రాబడి కావాలా? అయితే మీ కోసమే పోస్టాఫీస్ తీసుకొచ్చిన సూపర్ హిట్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. స్టాక్ మార్కెట్ రిస్క్ అసలే లేకుండా ఏకంగా 7.7శాతం వార్షిక వడ్డీ వచ్చే ఈ స్కీమ్‌లో కేవలం వడ్డీ రూపంలోనే రూ. 4.5 లక్షల వరకు చేతికి అందుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రిస్క్ లేకుండా జస్ట్ వడ్డీతోనే 4.5లక్షల ఆదాయం.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసుకోండి..
Post Office Nsc Scheme

Updated on: Nov 07, 2026 | 5:31 PM

సురక్షితమైన మార్గంలో చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ, ఎలాంటి రిస్క్ లేకుండా భారీ మొత్తాన్ని కూడబెట్టుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చక్కటి ఎంపికగా నిలుస్తున్నాయి. అన్ని వయసుల వారికి అనువైన పథకాలను అందిస్తున్న పోస్టాఫీసులో.. ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒకటి. మధ్యతరగతి ప్రజలు, పదవీ విరమణ ప్రణాళికలు వేసుకునే వారి కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ. 4.5 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వ గ్యారెంటీ.. సున్నా రిస్క్

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పెట్టిన పెట్టుబడికి పూర్తి రక్షణ ఉండటమే ఈ పథకం ప్రత్యేకత. ఎన్‌ఎస్‌సిలో చేసే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 7.7 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తోంది. కేవలం రూ. 1,000తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్కువ పెట్టుబడి పెడితే ఆ మేరకు రాబడి కూడా భారీగా ఉంటుంది. ఈ పథకం లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు.

రూ. 10 లక్షలు పెడితే చేతికి రూ. 14.49 లక్షలు

ఎన్‌ఎస్‌సి పథకంలో చక్రవడ్డీ లెక్కింపు ద్వారా రాబడి అంచెలంచెలుగా పెరుగుతుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఏకమొత్తంగా రూ. 10 లక్షలను ఇందులో డిపాజిట్ చేస్తే, 7.7శాతం వార్షిక వడ్డీ రేటుతో ఐదేళ్లలో ఏకంగా రూ. 4,49,034 కేవలం వడ్డీ రూపంలోనే అందుతుంది. ఐదేళ్ల కాలపరిమితి ముగిసే సమయానికి అసలు, వడ్డీ కలిపి మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ.14,49,034 ఖాతాదారుడి చేతికి అందుతుంది.

సంవత్సరాల వారీగా వడ్డీ వృద్ధి తీరు..

  • మొదటి సంవత్సరం: రూ. 77,000
  • రెండవ సంవత్సరం: రూ. 1,59,929
  • మూడవ సంవత్సరం: రూ. 2,49,044
  • నాల్గవ సంవత్సరం: రూ. 3,45,620
  • ఐదవ సంవత్సరం (మొత్తం వడ్డీ): రూ. 4,49,034

సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు

ఈ పథకం మంచి రాబడిని అందించడమే కాకుండా పన్ను ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు?

భారత పౌరసత్వం కలిగిన ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. పెద్దలు తమ సొంత పేరు మీద గానీ, మైనర్ పిల్లల తరపున సంరక్షకులుగా గానీ ఖాతాను తెరవవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ‘జాయింట్ అకౌంట్’ రూపంలోనూ ఖాతాను ప్రారంభించే సదుపాయం ఉంది. అయితే ప్రవాస భారతీయులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ట్రస్టులు, కంపెనీలకు ఈ పథకంలో చేరేందుకు అర్హత లేదు. ఎలాంటి రిస్క్ లేకుండా నికరమైన రాబడిని కోరుకునే వారికి పోస్టాఫీస్ ఎన్‌ఎస్‌సి ఒక సురక్షితమైన, లాభదాయకమైన దీర్ఘకాలిక పొదుపు మార్గంగా నిలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us