Post office scheme: భద్రతకు భద్రత, ఆదాయానికి ఆదాయం.. ఈ పథకంతో ప్రతీ నెల ఇన్‌కమ్..

|

Nov 02, 2023 | 2:33 PM

ఈ పథకంలో భాగంగా కస్టమర్లు కనీసం రూ. 1000ని పెట్టుబడిగా పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టిన తర్వాత నెల రోజుల నుంచి ఆదాయం పొందొచ్చు. ఈ పథకంలో పెట్టిన మొత్తం పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ పొందొచ్చు. నెలవారీగా ఈ వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. సింగిల్‌, జాయింట్‌ రెండు విధాలుగా ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఇక పెట్టబడి పరిమితి విషయానికొస్తే.. సింగిల్‌ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు...

Post office scheme: భద్రతకు భద్రత, ఆదాయానికి ఆదాయం.. ఈ పథకంతో ప్రతీ నెల ఇన్‌కమ్..
Post Office
Follow us on

డబ్బును ఖాళీగా ఇంట్లో పెడితే ఏం వస్తుంది.? పోనీ బ్యాంకులో పెడుదామంటే నెలవారీ వడ్డీ పొందే అవకాశం ఉండదు. ఇలాంటి వారి కోసమే పోస్టాఫీస్‌ మంచి పథకాన్ని తీసుకొచ్చింది. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంతో నెలవారీగా ఇన్‌కమ్‌ పొందొచ్చు. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఈ పథకంలో భాగంగా కస్టమర్లు కనీసం రూ. 1000ని పెట్టుబడిగా పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టిన తర్వాత నెల రోజుల నుంచి ఆదాయం పొందొచ్చు. ఈ పథకంలో పెట్టిన మొత్తం పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ పొందొచ్చు. నెలవారీగా ఈ వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. సింగిల్‌, జాయింట్‌ రెండు విధాలుగా ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఇక పెట్టబడి పరిమితి విషయానికొస్తే.. సింగిల్‌ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. అదే జాయింట్‌ ఖాతా అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకంలో చేరాలనుకుంటే పోస్టాఫీస్‌లో సేవింగ్స్‌ ఖాతా ఉండాలి. 18 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పథకం 5 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారుడు మరణిస్తే.. ఖాతాను మూసివేయొచ్చు. ఖాతాలో ఉన్న మొత్తం నామినీకి లేదా చట్టపరమైన వారసులకు తిరిగి చెల్లిస్తారు. పథకం మూసివేసిన చివరి నెల వరకు వడ్డీ చెల్లిస్తారు. ప్రతి నెలా చేతికి డబ్బులు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. పోస్టాఫీస్‌లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అలాగే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్‌ పేరు మంత్లీ ఇన్‌కమ్ పథకం. పేరులో ఉన్నట్లుగాన ప్రతి నెలా డబ్బులు వస్తాయ. ప్రస్తుతం పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ డబ్బులను ప్రతి నెలా చెల్లిస్తారు. కనీసం రూ.1000 నుంచి డబ్బులు పెట్టొచ్చు. గరిష్టంగా ఒక ఖాతాలో రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు నెలకు రూ.2475 వస్తుంది. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షలవరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

ముగ్గురు కలిసి కూడా ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే ఐదేళ్ల వరకు డబ్బులు తీసుకోవడానికి వీలుండదు. అయితే కొన్ని సందర్భాల్లో డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు తగ్గుతుంది. అంటే వచ్చే రాబడి తగ్గిపోతుంది. అందుకే ఒక్కసారి డబ్బులు పెడితే ఐదేళ్ల వరకు తీసుకోకుండా ఉండటమే మంచిది. పోస్టాఫీస్‌కు వెళ్లి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరొచ్చు.

ఒకవేళ మెచ్యూరిటీకి ముందే అకౌంట్‌ను క్లోజ్‌ చేయాలనుకుంటే కనీసం ఏడాది పాటు ఆగాల్సిందే. పెట్టుబడి పెట్టిన తర్వాత ఏడాది నుంచి 3 ఏళ్లలోపు ఖాతాను మూసివేస్తే, మీరు పెట్టుబడిగా పెట్టిన మొత్తం నుంచి 2 శాతానికి సమానమైన మొత్తాన్ని కట్‌ చేసుకుఆటరు. ఒక వేళ 3 నుంచి 5 ఏళ్ల మధ్య పెట్టుబడిని తీసుకోవాలంటే పెట్టుబడి మొత్తానికి సమానమైన 1 శాతం మొత్తాన్ని కట్ చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..