Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

| Edited By: Team Veegam

Mar 04, 2021 | 1:34 PM

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..?అయితే ఇది మీ కోసమే. పోస్టాఫీసుల్లో నగదు జమ చేయడం, లేదా నగదు ఉపసంహరించుకోవడంపై ఇప్పుడు ఛార్జీలు విధించనున్నారు...

Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గ్రామ సుమంగళ్ పథకాన్ని ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ పథకానికి ప్రస్తుతం వేయికి రూ.48 బోనస్ అందుతుంది. పాలసీదారుడికి 25 ఏళ్లు ఉంటే.. అతని నెలవారీ ప్రీమియం రూ.2853 ఉంటుంది. మూడు నెలల ప్రీమియం రూ.8449, ఆరు నెలల ప్రీమియం రూ.16715, వార్షిక ప్రీమియం రూ.32735 ఉంటుంది.
Follow us on

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..?అయితే ఇది మీ కోసమే. పోస్టాఫీసుల్లో నగదు జమ చేయడం, లేదా నగదు ఉపసంహరించుకోవడంపై ఇప్పుడు ఛార్జీలు విధించనున్నారు. ఈ కొత్త చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పోస్టల్‌ శాఖ తెలిపింది. అయితే పోస్టాఫీసుల్లో ఖాతాను బట్టి ఈ చార్జీలను వసూలు చేయనున్నారు. నెలకు నాలుగు సార్లు నగదు ఉపసంహరణ చేసుకుంటే ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. నాలుగు కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే ప్రతి లావాదేవీకి రూ.25 చొప్పున చార్జీలు విధించనున్నారు. అయితే ఈ విధానం బ్యాంకులకు ఉండేది. ఏటీఎంల నుంచి నాలుగు కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసినట్లయితే చార్జీలు విధించే వారు. ఇప్పుడు పోస్టల్‌ శాఖలో అమలు చేస్తున్నారు. అలాగే పోస్టాఫీసుల్లో నగదు జమ చేయాల్సిన సమయంలో ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ప్రాథమిక పొదుపు ఖాతా కాకుండా కరెంటు ఖాతా ఉంటే ప్రతి నెలా రూ.25వేల చొప్పున ఉపసంహరించుకోవచ్చు.

అప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. అంతేకాకుండా మీరు నెలలో పది వేల చొప్పున నగదు డిపాజిట్‌ చేసినట్లయితే ఎటువంటి రుసుము ఉండదు. ఆ మొత్తానికంటే ఎక్కువగా డిపాజిట్‌ చేసినట్లయితే కనీసం రూ.25 వసూలు చేయనున్నారు. అంతే మీ మొత్తంలో 0.50 శాతం వరకు వసూలు చేస్తారు. అలాగే పోస్టు పేమెంట్‌ నెట్‌వర్క్‌లో అపరిమిత లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌పై కూడా ఛార్జీ చెల్లించాలి. ఐపీపీబీయేతర నెట్‌ వర్క్‌లలో నెలకు మూడు లావాదేవీలు ఉచితం. అలాగే ఇవే కాకుండా పోస్టాఫీసులలో మినీ స్టేట్‌ మెంట్‌ తీసుకోవడానికి ఐదు రూపాయలు వసూలు చేస్తారు.

అలాగే ప్రస్తుతం ఛార్జీలను అమలు చేస్తున్నా..పోస్టల్‌ శాఖ వినియోగదారులకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసువస్తోంది. వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఒకప్పుడు లేటర్లకు మాత్రమే పరిమితం అయ్యే పోస్టల్‌ శాఖ.. అప్పుడు అన్ని రకాల సేవలను అందిస్తోంది. పోస్టల్‌ శాఖలో ఎన్నో రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది పోస్టల్‌ శాఖ.

ఇవి చదవండి :

SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఒక్క ఎస్ఎంఎస్‌తో పెన్షన్‌ లోన్‌ మంజూరు

Bank Holidays March 2021: మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు.. రెండు రోజులు సమ్మె.. పూర్తి వివరాలు

శుభవార్త.. భారీగానే తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు