సొంత ఇల్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.2.50 లక్షల సాయం.. పొందండిలా..

సొంత ఇల్లు లేనివారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా కొత్త ఇళ్లను మంజూరు చేసింది. ఏకంగా 2.50 లక్షల ఇళ్లకు తుది ఆమోదం తెలిపింది. దీంతో వీరికి కేంద్రం నుంచి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందనుంది. రూ.2.50 లక్షల వరకు ఆర్ధిక సాయం పొందవచ్చు.

సొంత ఇల్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.2.50 లక్షల సాయం.. పొందండిలా..
Pm Awas Yojana

Updated on: Nov 27, 2026 | 1:06 PM

నగరాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 1.75 లక్షల కొత్త ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తుది ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆమోద, పర్యవేక్షణ కమిటీ 11వ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.75 లక్షల ఇళ్లకు తుది ఆమోదం తెలపగా.. అదనంగా మరో 1.5 లక్షల ఇళ్లకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇంటి యాజమాన్య హక్కులకు సంబంధించి కుటుంబంలోని మహిళ పేరుపై లేదా ఉమ్మడిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అర్హతలు ఏంటంటే..?

దరఖాస్తుదారు లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులైన భర్త, భార్య, పెళ్లికాని పిల్లలు దేశంలో ఎక్కడా సొంత ఇల్లు కలిగి ఉండకూడదు. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారు రూ. 3 లక్షల్లోపు, తక్కువ ఆదాయ వర్గానికి చెందినవారు రూ. 6 లక్షల్లోపు, మధ్య ఆదాయ వర్గానికి చెందినవారు రూ.9 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. ఇక హోమ్ లోన్‌పై వడ్డీ రాయితీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే.. ఇంటి గరిష్ట ధర రూ. 35 లక్షలకు మించకూడదు. అలాగే హోంలోన్ మొత్తం రూ. 25 లక్షలకు మించకూడదని ప్రభుత్వం షరతులు విధించింది.

ఏయే పత్రాలు అవసరం

దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు, పాన్ కార్డు అవసరం. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్, శాలరీ స్లిప్ లేదా ITR కాపీ, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ లేదా స్టేట్‌మెంట్. భూమి యాజమాన్య పత్రాలు లేదా కేటాయింపు పత్రం. దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు లేదని సెల్ఫ్ డిక్లరేషన్ డాక్యుమెంట్ ఇవ్వాలి.

ఆర్ధిక సాయం ఎంత..?

సొంత భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు నిర్మించిన సరసమైన ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక హోమ్ లోన్ వడ్డీపై రూ. 1.80 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది
.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

– PMAYU 2.0 అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి

-హోమ్‌పేజీలోని ‘Apply for PMAYU 2.0’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-మీ వార్షిక ఆదాయం, రాష్ట్ర వివరాలను నమోదు చేసి మీ అర్హతను సరిచూసుకోవాలి

– ఆపై మీ అవసరానికి అనుగుణంగా BLC, AHP, ARH, ISS ఆప్షన్లను సెలక్ట్ చేసుకోవాలి

-మీ ఆధార్ నంబర్, పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి

– ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి

– ప్రధాన ఫారంలో వ్యక్తిగత వివరాలు, అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు అకౌంట్, ఆస్తి వివరాలను నమోదు చేయాలి

-అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి

– క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి

-అప్లికేషన్ ఐడిని భద్రపర్చుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us