Central Government: పేదల కోసం కేంద్రం అద్భుత పథకం.. ఒక్క పనితో అకౌంట్లోకి రూ.78 వేలు.. మీరూ అర్హులే..

పేదలకు కేంద్రం మంచి అవకాశం కల్పిస్తోంది. అదేంటంటే., ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. ఇంటిపై సోాలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే బాధ ఉండదు. సోలార్ ప్యానెల్స్‌కు అయ్యే ఖర్చులో ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది.

Central Government: పేదల కోసం కేంద్రం అద్భుత పథకం.. ఒక్క పనితో అకౌంట్లోకి రూ.78 వేలు.. మీరూ అర్హులే..
Solar Power

Updated on: Jun 22, 2026 | 1:27 PM

దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకుంటే కరెంట్ బిల్లు కట్టాల్సిన పనే ఉండదు. ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు. సోలార్ ప్యానెళ్లకు అయ్యే ఖర్చుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది.  ఇంతకు ఈ పథకం పేరేంటంటే.. ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన’. అసలు ఈ పధకం ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం ఏంటి..?

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేదలు ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేందుకు భారీగా సబ్సిడీ అందిస్తోంది. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, అట్టడుగు ప్రాంతాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా పేదలకు ఉచిత కరెంట్ అందిస్తోంది. . 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కోటి ఇళ్లలో సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. లబ్దిదారులు గరిష్టంగా 300 యూనిట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్సిడీ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారా వినియోగదారునికి చేరుతుంది. 1 కిలోవాట్‌ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్లకు రూ.30 వేలు, 2 కిలోవాట్‌లకు రూ.60 వేలు, 3 కిలోవాట్‌లకు గరిష్టంగా రూ.78 వేల సబ్సిడీ అందుతుంది

ఎవరెవరు అర్హులంటే..?

-దరఖాస్తుదారులు భారత పౌరులై ఉండాలి

-మధ్య, దిగువ తరగతి కుటుంబానికి చెందినవారై ఉండాలి

-దరఖాస్తుదారులు సొంత ఇల్లు కలిగి ఉండాలి. సోలార్ ప్యానెళ్లను అమర్చడానికి అనువుగా ఇంటి పైకప్పు ఉండాలి

-చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి

-దరఖాస్తుదారులు సోలార్ ప్యానెళ్ల కోసం మరే ఇతర సబ్సిడీలను పొందలేరు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ pmsuryaghar.gov.in సందర్శించాలి

– కన్స్యూమర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి

ఈ తర్వాత అప్లై నౌ బటన్‌పై క్లిక్ చేయాలి

-మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి

-ఆ తర్వాత ‘వెరిఫై’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి

-OTPతో లాగిన్ అవ్వాలి

– పేరు, ఇమెయిల్, చిరునామా, రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి

-అనంతరం సేవ్ పై క్లిక్ చేయండి

FAQ’S

ప్రశ్న: ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జవాబు: pmsuryaghar.gov.in పోర్టల్ సాయంతో దరఖాస్తు చేసుకోవాలి

ప్రశ్న: ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది..?

జవాబు: 2024లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది

ప్రశ్న: ఈ పథకం ద్వారా ఎంతవరకు లబ్ది పొందవచ్చు..?

జవాబు: రూ.78 వేల వరకు సాయం పొందవచ్చు..

 

Follow Us