ప్రతి సంవత్సరం చాలామంది ఉద్యోగులు మంచి జీతం కోసం తాము చేస్తోన్న ఉద్యోగాలను మారుతుంటారు. అలాంటప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పథకం, ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)లో భాగమైన వారు తమ పాత EPF ఖాతా నుంచి మొత్తం డబ్బును కొత్త ఎంప్లాయిర్‌కు మార్చడంలో జాగ్రత్త వహించాలి. ఈ క్రమంలోనే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నుంచి EPS సర్టిఫికేట్ కూడా పొందాలన్న విషయం చాలామంది ఉద్యోగులకు తెలియదు.
EPF చట్టం ప్రకారం, ఏ ఉద్యోగి అయినా తాను చేస్తోన్న ఉద్యోగానికి రిజైన్ చేసినా.. లేదా EPF పథకం నుంచి ఎగ్జిట్ అయ్యే సమయంలో కచ్చితంగా EPS సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే, చాలామందికి ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. తమకు ఎంతకాలానికి పించన్ వస్తుందో తెలుసుకునేందుకు ప్రతీ ఉద్యోగి ఈపీఎస్ స్కీమ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీనికి ఉదాహరణ.. ఒక ఉద్యోగి ఎన్నో రకాల ఉద్యోగాలు మారినప్పుడు.. తన కొత్త ఎంప్లాయిర్, అతడ్ని EPF స్కీమ్ కింద కవర్ చేయకపోతే.. అందుకు పాత EPF ఖాతాకు సంబంధించిన పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ సహాయపడుతుంది. ఇది మీ పెన్షన్ క్లెయిమ్‌కి సంబంధించి ప్రూఫ్‌గా పనికొస్తుంది.
EPS పథకాన్ని పొందే ప్రక్రియ చాలా సులభం. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు. మెంబర్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా EPF సభ్యుడు EPS స్కీమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.