SBI: ఎస్బీఐ నుంచి మీకు ఈ మెసేజ్ వచ్చిందా? ఖాతాదారులు ఇది మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే..

|

Nov 04, 2024 | 7:29 PM

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని సైబర్ నేరస్థులు డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ నుంచి రివార్డ్స్ పేరుతో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం లేదని అధికారులు చెబుతున్నారు..

SBI: ఎస్బీఐ నుంచి మీకు ఈ మెసేజ్ వచ్చిందా? ఖాతాదారులు ఇది మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే..
Sbi
Follow us on

సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజలను మోసం చేయడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజలను అత్యాశనే తమకు పెట్టుబడిగా మార్చుకొని మోసాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ మోసానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ పేరుతో ఓ కొత్త రకం స్కామ్‌ చేస్తున్నారు. నేరగాళ్లు.. ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ పేరుతో రివర్డ్స్‌ పాయింట్‌ వచ్చాయని. వాటిని రీడీమ్‌ చేసుకునేందుకు ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి అంటూ ఓ మెసేజ్‌ను వైరల్‌ చేస్తున్నారు. రీడీమ్‌ చేసుకోవాలంటే ఒక ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని సదరు మెసేజ్‌లో పేర్కొంటున్నారు. పొరపాటున ఆ లింక్‌ను క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే. వెంటనే మీ ఫోన్‌ మొత్తం సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ఇందులో పలు విషయాలను ప్రస్తావించింది. ఎస్‌బీఐ తమ యూజర్లను ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేయమని అడగదు అంటూ సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానాదస్పద లింక్‌లను క్లిక్‌ చేయకూడదని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే సైబర్ నేరాలను తగ్గించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేస్తోంది. ఏఐ ఆధారిత వార్నింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తోంది. ఈ ఫీచర్‌ సహాయంతో అనుమానాదస్పద లింక్‌లను వెంటనే గుర్తించి యూజర్లను అలర్ట్‌ చేయనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..