PF Account Transferred: పీఎఫ్‌ ఖాతా ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా?

ఈపీఎఫ్‌తో పాటు, ప్రత్యేక ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) ఖాతాను కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియదు. ఉద్యోగాలు మారిన తర్వాత, కొత్త యజమానికి ఈపీఎఫ్‌ ఖాతాను బదిలీ చేయాలి. దీనితో పాటు ఈపీఎస్‌ ఖాతాను కూడా బదిలీ చేయాలి. దీనికి పెన్షన్ సర్టిఫికేట్ అవసరం...

PF Account Transferred: పీఎఫ్‌ ఖాతా ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా?

Updated on: Sep 28, 2024 | 7:04 PM

ఈపీఎఫ్‌తో పాటు, ప్రత్యేక ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) ఖాతాను కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియదు. ఉద్యోగాలు మారిన తర్వాత, కొత్త యజమానికి ఈపీఎఫ్‌ ఖాతాను బదిలీ చేయాలి. దీనితో పాటు ఈపీఎస్‌ ఖాతాను కూడా బదిలీ చేయాలి. దీనికి పెన్షన్ సర్టిఫికేట్ అవసరం. ఈపీఎస్‌ బదిలీ చేయకపోతే ఈపీఎఫ్‌ నుండి ఉపసంహరించుకునేటప్పుడు సమస్యలు ఉండవచ్చు. సభ్యుడు ఈపీఎఫ్‌ మొత్తాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, పెన్షన్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉంది. మీరు ఈపీఎఫ్‌ ఖాతాను ఎలా బదిలీ చేయాలి? మీరు ఈ పనిని ఎలా పూర్తి చేయవచ్చో తెలుసుకుందాం.

  • ముందుగా మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మెంబర్ eSewa పోర్టల్‌కి లాగిన్ చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత, ఆన్‌లైన్ సర్వీస్ కింద ‘ఒక సభ్యుడు-ఒక ఈపీఎఫ్ ఖాతా’పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ పీఎఫ్‌ ఖాతా, వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరించండి. దీని తర్వాత వివరాలను పొందండం ఆప్షన్‌లోకి వెళ్లండి. దాని కింద పాత ఖాతా వివరాలు కనిపిస్తాయి.
  • యజమానిని ఎంచుకుని, సభ్యుని ID / UANని అందించండి. ఇప్పుడు OTP వస్తుంది. అది నమోదు చేసి సమర్పించాలి.
  • చివరి దశలో ‘ఫారమ్ 13’ ప్రింటవుట్ తీసుకొని దానిపై సంతకం చేయండి. ఈ ఫారమ్‌ను 10 రోజులలోపు యజమానికి సమర్పించాలి.
  • దీని తర్వాత మీ పీఎఫ్‌ ఖాతా బదిలీ చేయబడుతుంది. అలాగే పెన్షన్ ఖాతాను కూడా బదిలీ చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us