EPF: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులు తప్పనిసరిగా EPF తో సహా వివిధ పథకాలు EPFOతో అనుసంధానం అయి ఉంటాయని గమనించాలి. దీనిని సాధారణంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అని పిలుస్తారు. ఇప్పుడు, EPF ఆన్‌లైన్‌లో బదిలీ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం, epf.gov.in లో EPFO అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇటీవల EPF ఆన్‌లైన్ బదిలీ గురించి EPFOతన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ని ఎలా బదిలీ చేయాలో తెలుసుకోండి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
EPF పథకం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇవే..
1) పదవీ విరమణ, రాజీనామా, మరణం తర్వాత వడ్డీతో కలిపి వచ్చే రాబడి.
2) గృహ నిర్మాణం, ఉన్నత విద్య, వివాహం, అనారోగ్యం, ఇతరులు వంటి నిర్దిష్ట ఖర్చులకు పాక్షిక ఉపసంహరణలు దీనిలో అనుమతిస్తారు.
EPF ఆన్‌లైన్‌లో బదిలీ చేయడానికి కొన్ని దశలను అనుసరించాల్సిన అవసరం ఉందని EPFO సభ్యులు గమనించాలి. అవి ఇవీ..
1: ముందుగా, EPFO సభ్యుడు ‘యూనిఫైడ్ మెంబర్ పోర్టల్’ సందర్శించాలి. తరువాత UAN – పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
2: సభ్యులు ‘ఆన్‌లైన్ సేవలు’ కి వెళ్లి, ‘వన్ మెంబర్ – వన్ ఇపిఎఫ్ ఖాతా (బదిలీ అభ్యర్థన)’ పై క్లిక్ చేయాలి
3: తరువాత, EPFO సభ్యులు ప్రస్తుత సమాచారం కోసం వ్యక్తిగత సమాచారం.. PF ఖాతాను ధృవీకరించాలి
4: అభ్యర్థులు మునుపటి ఉపాధి PF ఖాతా కనిపించే ‘వివరాలను పొందండి’ ఎంపికపై క్లిక్ చేయాలి.
5: EPFO సభ్యులు ఇప్పుడు ధృవీకరణ ఫారం కోసం మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోవాలి
6: UAN రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTP ని అందుకోవడానికి సభ్యులు ‘OTP పొందండి’ ఎంపికపై క్లిక్ చేయాలి
7: చివరగా, EPFO సభ్యులు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి
ఇతర ప్రశ్నలు, వివరాల విషయంలో, EPFO సభ్యులు epfindia.gov.in లో EPFO యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వవచ్చు.