దేశవ్యాప్తంగా మే 22న పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురులో హెచ్చుదగ్గులు నమోదు అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా విక్రయిస్తున్నారు. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. దేశంలోని 4 మహానగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చి చూస్తే చమురు ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ ఆపరేటర్లు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరిగింది. ప్రస్తుతం ముడిచమురు బ్యారెల్‌కు $121గా ఉంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు ఉన్నప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించగా, రిలయన్స్-బిపి మరియు నైరా ఎనర్జీ వంటి ప్రైవేట్ రంగ రిటైల్ యూనిట్లు నష్టాలను పూడ్చుకోవడానికి పరిమిత కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. కొన్ని చోట్ల, ప్రభుత్వ రంగ యూనిట్ల కంటే నైరా లీటర్ ఇంధనాన్ని రూ. 3 ఎక్కువగా విక్రయిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.97.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 ఉండగా.. డీజిల్ 97.82గా ఉంది.