Petrol and Diesel Prices : మరోసారి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 5 రోజుల తర్వాత రూ.0.25 ఫైసలు పెంపు

వారం రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రో ధరలను పెంచుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.

Petrol and Diesel Prices : మరోసారి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 5 రోజుల తర్వాత రూ.0.25 ఫైసలు పెంపు

Updated on: Jan 13, 2021 | 11:03 AM

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి భగ్గమన్నాయి. వారం రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రో ధరలను పెంచుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.45కు చేరింది. అదేవిధంగా డీజిల్‌ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు చేరుకుంది. తాజాగా పెరిగిన ధరలతో జైపూర్‌లో పెట్రో, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధిక రేట్లు నమోదు చేసుకున్నాయి. జైపూర్‌లో తాజాగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.85 కాగా, డీజిల్‌ రూ.83.87కు చేరుకుంది. అటు, ముంబైలో పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరుకోగా, డీజిల్‌ ధర రూ.81.34 చేరింది. 2017, జూన్‌ 15 నుంచి దేశీయ చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షిస్తున్నాయి. అప్పటివరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలపై నిర్ణయం తీసుకునేవారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో పెట్రోల్‌ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయిః