Petrol Diesel Price: వాహనదారులకు కూల్ న్యూస్.. దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Petrol Diesel Price: గత కొద్ది రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా 32 వ రోజు కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Petrol Diesel Price: వాహనదారులకు కూల్ న్యూస్.. దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
Petrol Diesel Price

Updated on: Aug 19, 2021 | 9:23 AM

Petrol-Diesel Rates Today: గత కొద్ది రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా 32 వ రోజు కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపిస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.  

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.62గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.99గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.12గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.74గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.49గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.47 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.80 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.80 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.23 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.27గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.23గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.60గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.47 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.80లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.82 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.20గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.05 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.83 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.94గా ఉంది.

ఇవి కూడా చదవండి: Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..

Loading...
Unable to load recommendations.
Follow Us