పెట్రోల్, డీజిల్(Petrol & Diesel) ధరలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈరోజు అంటే మే 28 శనివారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వరుసగా 7వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం ఈ రోజు (శనివారం, మే 21, 21) కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 22 నుంచి దేశవ్యాప్తంగా చమురు ధరలు లీటరుకు రూ.7 నుంచి రూ.9.5కి తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తర్వాత, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్పై విధించే వ్యాట్ (విలువ-ఆధారిత పన్ను) ని తగ్గించాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ ప్రజలకు రెట్టింపు ఉపశమనం లభించింది.
దేశవ్యాప్తంగా 7 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో నేటికీ దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో పాత ధరకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.72, డీజిల్ రూ.89.62కు విక్రయిస్తున్నారు. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అదే సమయంలో కోల్కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76కాగా, హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82గా ఉంది.
కేరళ, రాజస్థాన్లో వ్యాట్ తగ్గినా ఉపశమనం లేదు..
కేరళ, రాజస్థాన్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించినప్పటికీ, అనేక ఇతర నగరాల కంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. జైపూర్లో పెట్రోలు ధర రూ. 109.46 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.61గా ఉంది. తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.107.87, డీజిల్ రూ.96.67గా ఉంది.
నగరం | పెట్రోల్ ధర లీటరుకు రూ. | డీజిల్ ధర లీటరుకు రూ. |
ఢిల్లీ | 96.72 | 89.62 |
ముంబై | 111.35 | 97.28 |
కోల్కతా | 106.03 | 92.76 |
చెన్నై | 102.63 | 94.24 |
బెంగళూరు | 101.94 | 87.89 |
హైదరాబాద్ | 109.66 | 97.82 |
పాట్నా | 107.24 | 94.04 |
భోపాల్ | 108.65 | 93.90 |
జైపూర్ | 109.46 | 94.61 |
లక్నో | 96.57 | 89.76 |
తిరువనంతపురం | 107.87 | 96.67 |
భగ్గుమంటోన్న ముడిచమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. శనివారం, ముడి చమురు ధరలు బ్యారెల్కు $ 117 పైన ట్రేడవుతున్నాయి. WTI క్రూడ్ ధర 113 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్లకు చేరుకుంది.