Petrol Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. దేశవ్యాప్తంగా బుధవారం ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..

Petrol Price Today: పెరగడమే తప్ప తగ్గడం తెలియదంటూ దూసుకెళుతోన్న ఇంధన ధరలకు బుధవారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోయినప్పటికీ బుధవారం కాస్త...

Petrol Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. దేశవ్యాప్తంగా బుధవారం ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 6:53 AM

Petrol Price Today: పెరగడమే తప్ప తగ్గడం తెలియదంటూ దూసుకెళుతోన్న ఇంధన ధరలకు బుధవారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోయినప్పటికీ బుధవారం కాస్త నిలకడగా ఉన్నట్లు కనిపించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా పెట్రోల్‌, ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపించాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బుధవారం ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 (మంగళవారం రూ.91.17 ) ఉండగా, డీజిల్‌ ధరూ.81.47 (మంగళవారం రూ.81.47 ) వద్ద కొనసాగుతున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 ఉండగా (మంగళవారం రూ.97.57 ), డీజిల్‌ రూ.88.60 (మంగళవారం రూ.88.60 )గా నమోదైంది. ఇక కోల్‌కతాలోనూ మంగళవారంతో పోలిస్తే ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.35 ఉండగా (మంగళవారం రూ.91.35 ), డీజిల్‌ రూ.84.35 (మంగళవారం రూ.84.35)గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే బుధవారం హైదరాబాదీలకు కూడా పెట్రోల్‌ ధరల పెరుగుదల నుంచి కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.79 గా ఉండగా (మంగళవారం రూ.97.79 ), డీజిల్‌ రూ.88.86 ( మంగళవారం రూ.88.86 ) వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్య పట్టమైన వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.37 గా నమోదుకాగా (మంగళ వారం రూ.94.37 ), డీజిల్‌ రూ.88.45 వద్ద (మంగళవారం రూ.88.45 ) కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.39 (మంగళవారం రూ.97.50) ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.90.91  (మంగళవారం రూ.91.01) వద్ద కొనసాగుతోంది. సాగరతీరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41 గా ఉండగా (మంగళవారం రూ.96.68 ), డీజిల్‌ రూ.89.95 గా (మంగళవారం రూ.90.20) నమోదైంది. ఇక దక్షిణ భారతదేశంలో మరో ముఖ్య పట్టణమైన చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.19 ఉండగా (మంగళవారం రూ.93.11 ), డీజిల్‌ రూ.86.53 గా (మంగళవారం రూ.86.45 ) నమోదైంది. బెంగళూరులో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.37 వద్ద కొనసాగుతోంది.

Also Read: Today Gold Price: శుభవార్త.. భారీగానే తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

Today Silver Price: బంగారం బాటలో వెండి.. దిగి వస్తున్న స్విల్వర్‌ ధర.. దేశ వ్యాప్తంగా తాజా ధరల వివరాలు

ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం.. టైర్–2 నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు గ్రోసరీ సేవలను విస్తరించేందుకు నిర్ణయం