Today Silver Price: బంగారం బాటలో వెండి.. దిగి వస్తున్న స్విల్వర్‌ ధర.. దేశ వ్యాప్తంగా తాజా ధరల వివరాలు

Today Silver Price: దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల కారణంగా ప్రతి రోజు ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి....

Today Silver Price: బంగారం బాటలో వెండి.. దిగి వస్తున్న స్విల్వర్‌ ధర.. దేశ వ్యాప్తంగా తాజా ధరల వివరాలు
Follow us

|

Updated on: Mar 03, 2021 | 6:09 AM

Today Silver Price: దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల కారణంగా ప్రతి రోజు ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు దిగి వస్తుండగా, అందే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బుధవారం కిలో వెండి ధరపై సుమారు 910 రూపాయల మేర దిగి వచ్చింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,600 ఉండగా, హైదరాబాద్‌లో 72,000 ఉంది. చెన్నైలో రూ. 72,000 ఉండగా, ముంబైలో రూ.66,600 ఉంది. కోల్‌కతాలో రూ.67,600 ఉండగా, బెంగళూరులో రూ.67,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,000 వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి.

ఇవి చదవండి :

ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫాం టికెట్‌ ధర రూ.50.. కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం అంటున్న రైల్వే అధికారులు

Semi Bullet Trains: త్వరలో సెమీ బుల్లెట్‌ రైళ్ల కూత.. ప్రత్యేక బోగీలు, ఆధునిక హంగులు..ప్రయోగాత్మక పరీక్షలు