Petrol, Diesel Prices : మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?

|

Jan 27, 2021 | 6:58 AM

రోజు రోజుకు అంతకంత పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

Petrol, Diesel Prices : మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?
Petrol Price Today
Follow us on

Today Petrol, Diesel Prices : దేశీయంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి.. రోజు రోజుకు అంతకంత పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిత్యం చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. దీంతో మునుపెన్నడూ లేనంతగా రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర జైపూర్‌లో అత్యధికం కాగా… పెట్రోల్ రేటులో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్ ధర ఆల్ టైమ్ రికార్డ్ ను అధిగమించింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ లీటరుకు 36 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 86.05 మార్క్ దాటేసింది. డీజిల్ లీటర్ 82 రూపాయల 76.23కు చేరింది. తాజా పెంపుతో జైపూర్ లో పెట్రో, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. జైపూర్ లో లీటర్ పెట్రోల్ ధర 93.60పైసలు కాగా డీజిల్ రూ.85.67పైసలకు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర 93.62గా ఉండగా.. డీజిల్ ధర 83.03గా ఉంది.

తాజాగా పెరిగిన ఆయిల్ ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 36 ఫైసలు పెరిగి రూ. 83.19కు చేరుకుంది. కాగా, డీజిల్ 39 పైసలు పెరిగి రూ. 83.19కి చేరుకుంది.