Petrol Diesel Rates: సామాన్యుడికి ఊరట.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఇదే ఇవాళ్టి ట్రెండ్‌..

|

Mar 29, 2021 | 10:36 AM

Petrol And Diesel Rates: నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో .. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీ వడ్డింపు మాత్రం ఆగిపోయింది. ఇదే సమయంలో..

Petrol Diesel Rates: సామాన్యుడికి ఊరట.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఇదే ఇవాళ్టి ట్రెండ్‌..
Fuel Price
Follow us on

Petrol And Diesel Rates: నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో .. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీ వడ్డింపు మాత్రం ఆగిపోయింది. ఇదే సమయంలో.. అంతర్జాతీయ మార్కెట్‌లో గ‌త పది పదిహేను రోజుల్లోనే ముడి చ‌మురు ధ‌ర‌లు 10 శాతం మేర తగ్గిపోయాయి. భారత్‌లో మాత్రం పెట్రో ధరలు పెరగడకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ధరల్లో తగ్గుదల కూడా కనిపించింది. మరి రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందా? లేదో వేచి చూడాలి. సోమవారం  దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.

పెట్రో ధరలు…

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.78 ఉండగా.. డీజిల్‌ ధర రూ.81.10 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.19గా ఉండగా డీజిల్‌ రూ. 88.20గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.32గాఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.99 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 86.10గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.39గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.45 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.27గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.33గా నమోదైంది. విజయవాడలో ధరల్లో స్థిరంగా కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.55 (ఆదివారం రూ.96.55) కాగా డీజిల్‌ ధర రూ. 90.60గా నమోదైంది… సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 95.74 (ఆదివారం రూ.95.94) గా  డీజిల్‌ ధర రూ. 89.31గా నమోదైంది.ఉంది.

ఇవి కూడా చదవండి :  కర్నాటకలో రాసలీలల సీడీ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తు రూట్ మార్చుతున్నారంటున్న సీడీ లేడీ..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక… హోలీ సంద్భంగా ఇలాంటి మోసాలకు ఛాన్స్..