Petrol Price Today: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్‌తో పోటీపడుతోన్న డీజిల్‌..

Petrol Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. నాలుగు నెలలు శాంతంగా ఉన్న ఇంధన ధరలకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం...

Petrol Price Today: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్‌తో పోటీపడుతోన్న డీజిల్‌..
Petrol Diesel Prices

Updated on: Mar 27, 2022 | 9:44 AM

Petrol Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. నాలుగు నెలలు శాంతంగా ఉన్న ఇంధన ధరలకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణం ఏదైనా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకుపోతున్నాయి. ఇక డీజిల్‌ ధర, పెట్రోల్‌తో పోటీ పడుతోంది. గుంటూరులో ఏకంగా లీటర్‌ పెట్రోల్‌ రూ. 100 దాటేసింది. ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నమోదైన పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్​పై 50 పైసలు పెరిగి రూ. 99.11వద్ద కొనసాగుతోంది. డీజిల్‌పై 55 పైసలు పెరగడంతో రూ. 90.42కి ఎగబాకింది.

* చెన్నైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 104.90 కాగా, డీజిల్ ధర రూ. 95 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతాలో ఆదివారం లీటర్‌ పెట్రోల్ రూ. 108.53, డీజిల్‌ రూ. 93.57గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 57 పైసలు పెరిగి రూ. 112.35కి పెరిగింది. డీజిల్‌ పై 60 పైసలు పెరిగి రూ. 98.68 వద్ద కొనసాగుతోంది.

* గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌పై 55 పైసలు పెరిగి, రూ. 114.36కి చేరింది. డీజిల్‌పై 57 పైసలు పెరిగి, రూ. 100.33 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖలో పెట్రోల్‌ ధర 55 పైసలు పెరిగి రూ. 113.08కి చేరింది. డీజిల్‌పై 58 పైసలు పెరిగి రూ. 99.09గా ఉంది.