
ఎక్కువమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. కేవలం ఒకే బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగించుకుంటూ మిగతా వాటిని పట్టించుకోరు. అవసరం లేదనుకుని మిగిలిన బ్యాంక్ ఖతాలాను అలాగే వదిలేస్తారు. ఇలా మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి కొన్ని ఏళ్ల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకపోతే దానిని సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకవేళ ఆ బ్యాంకు అకౌంట్లో నగదు ఏమైనా ఉంటే మీరు ఆన్‌లైన్ ద్వారా తీసుకోలేరు. ఇనాక్టివ్ అకౌంట్లో 10 సంవత్సరాలైనా డబ్బులు తీసుకోకపోతే వాటిని ఆర్బీఐ అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్‌గా పరిగణిస్తుంది. వీటిని ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవెర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేస్తోంది. ఇలా బదిలీ అయిన తర్వాత కూడా మీరు మీ అకౌంట్లోని డబ్బులను తీసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం.
-ఆర్బీఐ తీసుకొచ్చిన ఉద్గమ్ పోర్టల్ (UDGAM)ను ఓపెన్ చేయండి
-మీ డీటైల్స్‌తో ఆ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి
-ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నేమ్, పాస్ వర్డ్‌తో మళ్లీ లాగిన్ అవ్వండి
-అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఆప్షన్‌ను ఎంచుకుని మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు, ఆధార్, మీ నేమ్ లాంటి వివరాలు ఇచ్చి సెర్చ్ చేయండి
-ఇనాక్టివ్ అయిన బ్యాంకు వివరాలు మీకు కనిపిస్తాయి. మీ పేరు అన్‌క్లెయిమ్డ్ జాబితాలో ఉంటే మీరు బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు
-మీరు అకౌంట్ తీసుకున్న బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లండి
-ఆధార్, పాన్ కార్డు లాంటి ధృవీకరణ పత్రాలు సమర్పించి ఈకేవైసీ పూర్తి చేయండి
-ఆ తర్వాత మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది
-అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ ఫారం పూర్తి చేసి బ్యాంకు సిబ్బందికి అందించండి
-పరిశీలన అనంతరం మీ అకౌంట్లోని డబ్బులను వడ్డీతో సహా బ్యాంకులు చెల్లిస్తాయి
ఒకవేళ వ్యక్తి చనిపోయి అతడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే.. నామినీలుగా ఉన్న వ్యక్తులు డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి అవసరమైన ఫారంలు పూర్తి చేసి ఆధారాలు సమర్పించాలి. దీంతో అతడి అకౌంట్లోని డబ్బులను నామినీకి వెంటనే అందిస్తారు. చాలామందికి ఈ విషయాలు తెలియక అకౌంట్లోని డబ్బులను వదిలేసుకుంటారు. ఈ క్రమంలో దీనిపై ఆర్బీఐ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటు బ్యాంకు అధికారులు కస్టమర్లకు కాల్ చేసి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించందుకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ దీని కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది.