Pan Card: డిసెంబర్ 31 వరకే డెడ్‌లైన్.. ఇది చేయకపోతే కొత్త ఏడాదిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.. ఒకసారి చెక్ చేస్కోండి

December 31: 2025వ సంవత్సరం ముగుస్తుండటంతో అందరీ నోట ఒకేమాట. కొత్త ఏడాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అనే మాటలే వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు విధించిన డెడ్ లైన్ ప్రకారం మీరు కొన్ని పనులు చేయకపోతే కొత్త ఏడాదిలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

Pan Card: డిసెంబర్ 31 వరకే డెడ్‌లైన్.. ఇది చేయకపోతే కొత్త ఏడాదిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.. ఒకసారి చెక్ చేస్కోండి
Pan And Aadhar Linking

Updated on: Dec 23, 2025 | 12:48 PM

PAN-Aadhar Link: ఇండియాలో ఏ ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలన్నా పాన్ కార్డు అనేది అవసరం. ఇది లేకుండా మనం ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు చేయలేము. అంతేకాకుండా అలాంటి సేవలు కూడా పొందలేము. దేశంలో ఆర్ధిక వ్యవహారాలకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి జీతం అందుకునే వరకు ఇలా పాన్ కార్డు అనేది ప్రతీదానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ పాన్ కార్డు అవసరమే. ఆర్ధిక విషయాలకే కూడా ఇది ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందేందుకు ఓ గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది.

పాన్ కార్డులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకోసం డిసెంబర్ 31 వరకు డెడ్ లైన్ విధించింది. ఆలోపు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకోనివారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇందుకు కేంద్రం అనేకసార్లు గడువు పొడిగించింది. ఈ సారి డెడ్ లైన్ పొడిగించే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటికీ చేసుకోవారిపై కఠిన చర్యలకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్స్ రెడీ అవుతోంది. పాన్ కార్డును రద్దు చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం లాంటివి చేయనుందని తెలుస్తోంది.

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు

ఒకవేళ మీరు ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుంది. దీని వల్ల మీరు బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోలేరు. కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా మీకు కుదరదు. డెబిట్, క్రెడిట్ కార్డులు, డీ మ్యాట్ అకౌంట్, లోన్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం, బీమా ప్రీమియం చెల్లింపులు వంటి సేవలు పొందలేరు,. అలాగే మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే జీతం పొందటంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఇదే కాకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు. ఒకవేళ ముందే మీరు ఐటీఆర్ దాఖలు చేసి ఉన్నా.. ఇప్పుడు ఆ డబ్బులు పొందలేరు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ట్రాన్సక్షన్లు చేయలేరు.  ఇక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టలేరు. అలాగే విదేశీ పర్యటన సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లు చెల్లింపులు చేయలేరు. మీ పాన్ కార్డు రద్దయితే ఒకరకంగా మీరు ఆర్ధికంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు.