SBI: న్యూ ఇయర్ వేళ ఎస్బీఐ నుంచి దిమ్మతిరిగే న్యూస్.. అద్భుత ప్రయోజనాలతో కొత్త స్కీమ్ లాంచ్.. ఒక్కసారి చూడండి

నూతన సంవత్సరం వస్తుండటంతో కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ అందించింది. అదిరిపోయే ఆఫర్లతో ఓ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను కొత్తగా ప్రారంభించింది. ఇందులో డిపాజిట్ చేసినవారికి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. లోన్ పొందే సౌకర్యంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ బెనిఫిట్ కూడా ఇస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

SBI: న్యూ ఇయర్ వేళ ఎస్బీఐ నుంచి దిమ్మతిరిగే న్యూస్.. అద్భుత ప్రయోజనాలతో కొత్త స్కీమ్ లాంచ్.. ఒక్కసారి చూడండి
Sbi

Updated on: Dec 24, 2025 | 1:28 PM

బ్యాంకింగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. దేశంలోనే నెంబర్ వన్ ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు న్యూ ఇయర్ సందర్భంగా అద్బుతమైన కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందగలిగే నూతన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని లాంచ్ చేసింది. అధిక వడ్డీ అందించే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్

గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ పేరుతో దీనిని ఎస్బీఐ ప్రారంభించింది. ఈ పథకంలో భారత్‌లో నివసించేవారితో పాటు ప్రవాస భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడి పెట్టవచ్చు. మూడు కాల పరిమితులతో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. 1,111, 1,777, 2,222 రోజుల కాలపరిమితులు ఎంచుకుని పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐ బ్రాంచుకి వెళ్లి ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండగా.. త్వరలో యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు రానుంది.

వడ్డీ రేట్లు ఎంతంటే..?

1,111 రోజుల టెన్యూర్ ఎంచుకున్నవారికి 6.65 శాతం, 1,777 కాలపరిమితితో 6.65 శాతం, 2,222 రోజుల కాలవ్యవధి ఎంచుకుంటే 6.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లు, ఎస్‌బీఐ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది.

ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం

ఇక ఈ పధకం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినవారికి లోన్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. మీ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ బెనిఫిట్ ఉపయోగించుకోవచ్చు. ఇక టీడీఎస్ ఈ పథకానికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఉపయోగించనున్నారు. తక్కువ రిస్క్ ఎక్కువ రాబడి కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిగా చెప్పవచ్చు.