
Tax Rules in India: భార్యభర్తల మధ్య జరిగే నగదు లావాదేవీలకు ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు. భార్య పేరు మీదకి భర్త ఆస్తులు లేదా నగదు ట్రాన్స్‌ఫర్ చేసినా , భర్తకు భార్య ట్రాన్స్‌ఫర్ చేసినా చట్ట ప్రకారం ట్యాక్స్ ఉండదు. గిఫ్ట్ రూపంలో మీ భార్యకు లేదా భర్తకు మీరు డబ్బులు ఇవ్వొచ్చు. చట్టరీత్యా దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే ఇలా భార్య లేదా భర్త పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయడం కరెక్టేనా..? ఇలా చేస్తే నిజంగా ట్యాక్స్ ఆదా అవుతుందా..? ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56(2)(x) ప్రకారం భార్య లేదా భర్తకు నగదు రూపంలో ఇచ్చే గిఫ్ట్‌లకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. ఇందుకు ఎలాంటి గరిష్ట పరిమితి కూడా లేదని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. కానీ వాటి ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం ట్యాక్స్ ఉంటుందని అంటున్నారు.
మీరు మీ భర్త లేదా భార్యకు ఇచ్చిన నగదును వేరే చోట పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదిస్తే దానికి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. క్లబ్లింగ్ నిబంధన ప్రకారం ఆ డబ్బుపై సంపాదించే ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 64(1)(iv) ద్వారా గిఫ్ట్ రూపంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయంపై మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులను వాళ్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర మార్గాల ద్వారా పెట్టుబడి పెడితే.. వాటి ద్వారా వచ్చే ఇన్‌కమ్‌పై తప్పనిసరిగా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేవలం గిఫ్ట్ రూపంలో డబ్బులు ఇవ్వడం వల్ల ట్యాక్స్ మనహాయింపు ఉంటుందన మీరు అనుకుంటారు. కానీ దాని ద్వారా వచ్చే ఆదాయంపై మీరు పన్ను కట్టాల్సి వస్తుంది.
మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ ఆదాయంపై పన్ను చెల్లించండి. ఆ తర్వాత మీ భార్య లేదా భర్తకు గిఫ్ట్‌గా నగదు ఇవ్వండి. గిఫ్ట్‌గా ఇచ్చిన నగదుపై పన్ను ఆదా చేసుకోవాలంటే పన్ను మినహాయింపు (PPF) లేదా పిన్ మనీలో పెట్టుబడి పెడితే మంచిది ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి