
Loan EMIS: సొంతింటి కల అందరికీ ఉంటుంది. మంచి ఇల్లు కట్టుకుని కుటుంబంతో హాయిగా గడపాలని కలలు కంటూ ఉంటారు. ధరలన్నీ పెరిగిన క్రమంలో సొంత ఇల్లు కట్టుకోవాలంటే లక్షలతో కూడుకున్న పని. సామాన్య, మధ్యతరగతి ప్రజలకైతే సొంతిల్లు నిర్మించుకోవడం పెద్ద కష్టమేనని చెప్పాలి. కొంతమంది అప్పు తెచ్చుకుని లేదా బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకుంటారు. హోమ్ లోన్ కావాలంటే మీ స్ధిరాస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా ప్రాసెస్ ఉంటుంది. హోమ్ లోన్ ఈఎంఐ 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కట్టాలన్నా మీకు భారమే అనిపిస్తుంది. అయితే కొన్ని ట్రిక్స్ పాటిస్తే 20 ఏళ్ల ఈఎంఐని కేవలం 11 ఏళ్లలోనే మీరు పూర్తి చేయొచ్చు. దీని వల్ల మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.
మీ జీతం ప్రతీ సంవత్సరం పెరుగుతుంటే.. ఈఎంఐ కూడా పెంచుకోండి. ఇలా ప్రతీ ఏడాది మీరు పెంచుకోవడం వల్ల మీ లోన్‌ను వీలైనంత తక్కువ సంవత్సరాల్లో తీర్చవచ్చు. ఏడాదికి 5 శాతం పెంచుకుంటూ వెళ్లండి. అంతేకాకుండా మీరు 20 ఏళ్లు ఈఎంఐ రూపంలో చెల్లించాలంటే వడ్డీ కూడా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అదేకాకుండా ముందే క్లోజ్ చేసుకుంటే మీకు వడ్డీ మిగులుతుంది. ఉదాహరణకు మీరు హోమ్ లోన్ రూ.60 లక్షల లోన్ తీసుకుని కాల వ్యవధి 20 ఏళ్లు నిర్ణయించుకున్నారనుకుందాం. మీరు కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది. అసలు చాలా స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఇలా కట్టుకుంటూ పోతే వడ్డీ పోనూ పదేళ్ల తర్వాత కూడా రూ. 42 లక్షల 60వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయతే ప్రతీ ఏడాది ఈఎంఐ కట్టే అమౌంట్ పెంచుకుంటూ పోతే మీరు 11 ఏళ్లల్లోనే లోన్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇక మీరు కట్టాల్సిన ఈఎంఐ కంటే ప్రతీ ఏడాదిలో ఒక అదనపు ఈఎంఐ చెల్లించండి. దీని వల్ల మీ లోన్ టెన్యూర్ తగ్గిపోవడమే కాకుండా త్వరగా చెల్లించడం ద్వారా వడ్డీ కూడా ఆదా అవుతుంది. మీరు బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదిస్తే మీ ఈఎంఐ అమౌంట్‌ను పెంచుతారు. మీకు హోమ్ లోన్ ఉండి ఈఎంఐ ఎక్కువ కట్టే స్తోమత ఉంటే ఈ ట్రిక్ పాటించడం బెటర్. దీని ద్వారా మీకు డబ్బులు చాలా ఆదా అవ్వడమే కాకుండా లోన్ త్వరగా తీరిపోతే మీకు టెన్షన్ తగ్గుతుంది.