
Betel Leaf Juice: డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగం చేసి కొంతమంది డబ్బులు సంపాదిస్తే.. మరికొంతమంది సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో వ్యాపారం పెట్టుకుంటారు. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి ఏ బిజినెస్ పెట్టాలనేది కన్‌ప్యూజన్‌గా ఉంటుంది. చిన్నదైనా, పెద్దదైనా ముందు ఏదోకటి స్టార్ట్ చేయాలని తహతహలాడుతూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అందులో తమలపాకు రసం బిజినెస్ కూడా ఒక్కటని చెప్పవచ్చు. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి..? ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? అనే వివరాలు చూద్దాం.
భారదేశంలో తమలపాకును ఒక ఆయర్వేద ఆకుగా పరిగణిస్తారు. దీనికి ఏదో విశిష్టత కూడా ఉంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు తమలపాకు పెట్టి తాంబులాలు ఇస్తారు. ఇక ఫంక్షన్‌లో చివరిగా ఇచ్చే కిల్లీలో కూడా తమలపాకు వినియోగిస్తారు. తమలపాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అనేక ఆయుర్వేద మందుల్లో ఈ ఆకులను వినియోగిస్తారు. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి అనేక వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలున్నా తమలపాలను మీరు వ్యాపారంగా చేసుకోవచ్చు. తమలపాకులతో రసం తయారుచేసి డబ్బులు సంపాదించవచ్చు.
రైతుల నుంచి తక్కువ ధరకు తమలపాకులు కొనుగోలు చేయాలి. లేదా హోల్ సేల్ మార్కెట్ల నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఆ తమలపాకులను శుభ్రం చేసి మెషీన్‌లో వేస్తే రసం వస్తుంది. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే మెషీన్లు లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు. తమలపాకుల నుంచి వచ్చిన రసాన్ని మీరు బాటిళ్లల్లో ప్యాకేజ్ చేసి విక్రయించాలి.
దగ్గరల్లోని కూరగాయల మార్కెట్లు, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయించవచ్చు. ఇక ఆయుర్వేద, ఆరోగ్య, సిద్ద వైద్యశాలకు సరఫరా చేయొచ్చు. ఇక సోషల్ మీడియా ద్వారా మీరు విక్రయించవచ్చు. అలాగే షాపులకు విక్రయించవచ్చు. మెరుగైన నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, మార్కెట్ ఎక్కువ చేసుకోగలిగితే తక్కువ పెట్టుబడితేనే ఈ వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదింవచ్చు.
తమిళనాడులోని తేని జిల్లా సురులిపిట్టికి చెందిన రేణుక అనే మహిళ గత కొంతకాలంగా తమలపాకు రసం వ్యాపారం చేస్తోంది. ఆమె నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తోంది. ఈమెలా మీరు కూడా సంపాదించవచ్చు.