
బంగారం తాకట్టి పెట్టి లోన్ తీసుకోవడం అనేది ఇటీవల మరింత ఎక్కువైంది. ఖర్చులు పెరిగిపోతుండటంతో ఆర్ధిక అవసరాల కోసం చాలామంది తమ ఇంట్లోని గోల్డ్‌ను తాకట్టి పెట్టి లోన్ తీసుకుంటున్నారు. మిగతా రుణాలకు చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. మంజూరు కావడానికి చాలా సమయం పడుతుంది. అదే గోల్డ్ లోన్ సులువుగా మంజూరు చేయడంతో పాటు పేపర్ ప్రక్రియ చాలా తక్కువగా ఉంటుంది. గంటలోనే బ్యాంక్ నుంచి ఈ రుణం సులభంగా పొందవచ్చు. దీంతో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఈ లోన్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా వడ్డీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.
ఇటీవల బ్యాంకులే కాకుండా దుకాణాదారులు కూడా గోల్డ్ తాకట్టు పెట్టుకుని నగదు ఇస్తున్నారు. బ్యాంక్‌కు వెళ్లే బదులు సమీపంలోని దుకాణాదారుడి దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. అయితే బంగారం తాకట్టు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక వ్యాపారుల వల్ల తాకట్టు పెట్టకపోవడం మంచిదని చెబుతున్నారు. రిజిస్టర్ కాని వ్యాపారులను అసలు నమ్మవద్దని సూచిస్తున్నారు. రిజిస్టర్డ్ ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థ లేదా బ్యాంక్ వద్ద మాత్రమే తీసుకోవాలి. ఆర్బీఐ నిబంధనలు లోబడి ఈ సంస్థలు పనిచేస్తాయి. అందుకే మీ బంగారం సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ బంగారాన్ని బీమా చేయబడిన ఖజానాలో భద్రపరుస్తారు. అందుకే మీ గోల్డ్‌కు పూర్తి రక్షణ ఉంటుంది.
ఇక ఒక్కో సంస్థ ఒక్కోలా వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటుంది. 7 శాతంతో మొదలై 29 శాతం వరకు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ వడ్డీ ఉన్న సంస్ధను ఎంచుకోండి. ఇక ప్రాసెసింగ్ ఫీజులు, వాల్యుయేషన్ ఛార్జీలు, హిడెన్ ఛార్జీల గురించి కూడా తెలుసుకోండి. ఇక సులభ రీపేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి. ఈఎంఐ ద్వారా ప్రతీ నెలా చెల్లించడం లేదా బుల్లెట్ రీపేమెంట్‌ను సెలక్ట్ చేసుకోవడం లాంటివి చూసుకోవాలి. బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ద్వారా ఒకేసారి మొత్తం చివరిలో చెల్లించవచ్చు. దీంతో మీ ఖర్చులు, అవసరాలను బట్టి ఏది సెలక్ట్ చేసుకుంటారనేది నిర్ణయించుకోండి. అలాగే లోన్ టెన్యూస్ కాలం సరిగ్గా ఎంచుకోండి. 3 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. దీనిని కొన్ని సంస్థలు 3 ఏళ్ల వరకు కూడా పొడిగిస్తాయి. దీంతో మీ అవసరాలకు తగ్గట్లు ఎంత కాలం అనేది నిర్ణయించుకోండి. గోల్డ్ తాకట్టు పెట్టే సమయంలో వీటన్నింటిని చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే ఏ సంస్ధ దగ్గర తీసుకోవాలనేది డిసైడ్ అవ్వండి.