Financial Literacy: మీ పిల్లలకు ఆ పాఠాలు నేర్పడం లేదా? వెంటనే మొదలు పెట్టండి! లేకుంటే చాలా నష్టపోతారు..

| Edited By: Anil kumar poka

Dec 28, 2022 | 4:58 PM

ఫలితంగా డబ్బు విలువ వారికి తెలియకుండా పోతోంది. అలాగే దానిని ఎలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలో కూడా వారికి అవగాహన లేకుండా పోతోంది. ఫలితంగా పెద్దయ్యాక వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెరిగిపోతున్న ఆన్ లైన్ ఆర్థిక నేరాలకు ఇలాంటి వారు చిక్కుకొని నష్టపోతున్నారు.

Financial Literacy: మీ పిల్లలకు ఆ పాఠాలు నేర్పడం లేదా? వెంటనే మొదలు పెట్టండి! లేకుంటే చాలా నష్టపోతారు..
Emergency Fund
Follow us on

తల్లిదండ్రులు తమ పిల్లలకు అని విషయాలపై అవగాహన కల్పించడం అవసరం. కానీ మన దేశంలో చాలా మంది విద్య, వైద్యం, క్రీడలు, మ్యూజిక్, మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్ ఇలా అన్నింటిపై తర్ఫీదునిస్తుంటారు. కానీ ఒక్క విషయంలో మాత్రం పిల్లలకు ఇంకా టైం ఉంది అప్పుడే ఎందుకు అనుకుంటారు. అదే ఆర్థిక పరమైన అంశాలు. కొంతమంది పిల్లలు అడిగినంత ఇచ్చి ఖర్చు చేసుకోమంటారు. మరికొందరూ అడగకపోయినా ఇచ్చి ఎంజాయ్ చేయమంటారు. మరికొందరూ అస్సలు ఇవ్వకుండా వారిని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఫలితంగా డబ్బు విలువ వారికి తెలియకుండా పోతోంది. అలాగే దానిని ఎలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలో కూడా వారికి అవగాహన లేకుండా పోతోంది. ఫలితంగా పెద్దయ్యాక వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెరిగిపోతున్న ఆన్ లైన్ ఆర్థిక నేరాలకు ఇలాంటి వారు చిక్కుకొని నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో మీ పిల్లలకు కూడా ఆర్థిక అక్షరాస్యత అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బ్యాంకు మోసాల్లో మనమే టాప్..

RBI నుంచి ఇటీవలి డేటా ప్రకారం, గత ఏడేళ్లలో బ్యాంకు మోసాల కారణంగా భారతీయులు ప్రతిరోజూ కనీసం రూ. 100 కోట్లు కోల్పోతున్నారు. ఈ విషయాల గురించి మనం విన్నప్పుడు, మనలాంటి వారికి ఇది జరుగుతుందని మనం ఎప్పుడూ అనుకోం. తీరా జరిగాక విస్తుపోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చదువుకున్న యువకులు కూడా ఇలా దోపిడి గురవడం! దీనికి ప్రధాన కారణం వారిలో ప్రాథమిక ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమే. ఈ నేపథ్యంలో పిల్లలకు చిన్ననాటి నుంచే డబ్బు, దాని విలువ, పొదుపు మార్గాలు, సంరక్షణ మార్గాలు, అప్పుల గురించిన అవగాహన కల్పించడం ద్వారా వారికి అత్యంత విలువైన ఆస్తిని వారికిచ్చిన వారం అవుతాం.

ఏ వయసు పిల్లలకు అవగాహన కల్పించాలి.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఐదు లేదా ఆరేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి డబ్బు సంబంధిత అంశాలపై వారితో చర్చించాలి. ఆ వయస్సు నుంచే వారికి అన్ని అర్థం చేసుకునే అభిజ్ఞా నైపుణ్యం వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలకు ఏం నేర్పించాలి..

ఆర్థిక క్రమ శిక్షణకు సంబంధించిన అంశాలు పిల్లలకు నేర్పించాలి. స్మార్ట్‌గా బడ్జెట్‌ను ఎలా ఖర్చు చేయాలి? త్వరగా ఆదా చేయడం ఎలా? వివేకంతో రుణాలు తీసుకోవడం.. రిటైర్‌మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం కోసం ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం ఎందుకు ముఖ్యం? అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం ఎలా? వంటి వాటిపై అవగాహన కల్పించాలి.

ఇన్ డెప్త్ గా కూడా..

ఈ ప్రాథమిక అంశాలతో పాటు పన్నులు, మారకపు రేట్లు, కొనుగోలు శక్తి, ద్రవ్యోల్బణం, మంచి, చెడు రుణాలు, ఆస్తుల కేటాయింపు తదితర అంశాలపై కూడా వయసు పెరిగే కొద్దీ నేర్పిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈఎంఐలు కట్టే విధానం, దానిలోని భారం,క్రెడిట్ కార్డు బిల్లులు, సిబిల్ స్కోర్, లోన్ పొందే విధానం, డబ్బు పొదుపు విధానం, సంపద పెంపు వంటి వాటిపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పిస్తే వారు మంచి ఆర్థిక నిపుణులుగా మారి తమ జీవితాన్ని మంచి సమతుల్యంతో ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..