EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే మీకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది. మీరు రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ప్రభుత్వం నుంచి పెన్షన్ సొమ్ము పొందవచ్చు. ఇందుకోసం మీరు ఎలాంటి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ సౌకర్యం ఉన్న ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..
Epfo

Updated on: Feb 10, 2026 | 10:27 PM

దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఏడాది వార్షిక వడ్డీతో పాటు రూ.7 లక్షల వరకు ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయిూస్ పెన్షన్ స్కీమ్(EPS) ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలేంటి..? ఎవరెవరికి వర్తిస్తుంది.. ?అర్హతలు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

పెన్షన్ పొందటానికి రెండు కండీషన్లు

ఈపీఎఫ్‌వో ఖాతాదారులు పెన్షన్ పొందటానికి రెండు అతిపెద్ద షరతులు ఉన్నాయి. కేంద్రం రెండు కఠినతరమైన కండీషన్స్‌ను విధించింది. వీటిని మీరు పాటించకపోతే పెన్షన్ ప్రయోజనాలు పొందలేరు. అందులో ప్రధానమైనది ఏంటంటే… ఖచ్చితంగా 10 ఏళ్ల పెన్షన్ సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి. మీరు మధ్యలో ఉద్యోగాలు మారి మీ పీఎఫ్ నగదును ఉపసంహరించుకుంటే ఈ సమయం పెన్షన్ సర్వీసులో లెక్కించరు. మీ పీఎఫ్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేసినప్పుడు మాత్రమే సర్వీస్ కాలం లెక్కిస్తారు. ఇక మరో నిబంధన ఏంటంటే.. ఖచ్చితంగా 58 ఏళ్లు నిండి ఉండాలి. 58 ఏళ్ల తర్వాతే మీకు నెలనెలా పెన్షన్ అందుతుంది.

పెన్షన్ డబ్బులు ఎలా వెళతాయి

యజమాని మీ పీఎఫ్ ఖాతాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకంకు వెళుతుంది. జీతం ఆధారంగా కాకుండా ప్రభుత్వం విధించిన కనీస వేతన పరిమితి ఆధారంగా ఇది జమ చేయబడుతుంది. దీంతో లక్ష రూపాయిల శాలరీ కలిగిన ఉద్యోగి అయినా ఒక నిర్ధిష్ట పరిమితి తర్వాత పెన్షన్ పొందలేరు. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ పూర్తి చేసినా మీరు పెన్షన్ పొందవచ్చు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీరు ఉద్యోగం విడిచిపెట్టాక వీటిని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో సర్వీస్ టేబుల్‌ని ఉపయోగిస్తుంది. అంటే మీ సర్వీస్ సంవత్సరం ఆధారంగా లెక్కించి ఒకేసారి అందిస్తారు. అయితే 50 ఏళ్ల తర్వాత కూడా మీరు పెన్షన్ పొందవచ్చు. కానీ మీకు వచ్చే పెన్షన్ ప్రతీ నెలా తగ్గించబడుతుంది. ఈ తగ్గింపు శాశ్వతంగా ఉంటుంది. దీని వల్ల మీరు తక్కువ డబ్బులను అందుకోగలుగుతారు.  అయితే 58 ఏళ్ల తర్వాత తీసుకుంటే ఎక్కువ పెన్షన్ అందుకోవచ్చు. ఇక అత్యవసరమైన సమయంలో మాత్రమే 50 ఏళ్ల తర్వాత తీసుకోండి. లేకపోతే 58 ఏళ్ల వరకు ఉంచుకవడం వల్ల ఎక్కువ నగదును పొందే అవకాశముంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు భద్రత కోసం వీటిని కేంద్రం అందిస్తోంది.