
ప్రముఖ డిజిటల్ పేమేంట్స్ యాప్.. పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఇక నుంచి పేటీఎం మనీ నుంచి త్వరలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే అనేక సర్వీసులతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ పేమేంట్ యాప్.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సర్వీసుల ప్రారంభం కోసం సెబీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాల్ని.. పేటీఎం అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
‘స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు చూస్తున్నామని.. నిర్వహణ, ఆపరేషన్లు తదితర అంశాలపై మా బృందం స్టాక్ ఎక్స్చేంజీలను సంప్రదించిందని పేర్కొంది. ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్లో తెలిపింది. ఈక్విటీ, క్యాష్ సెగ్మెంట్, డెరివేటివ్స్, ఈటీఎఫ్‌లలో పేటీఎం మనీ ట్రేడింగ్‌ను అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం పేటీఎంకు సంబంధించిన ధరల ప్రణాళికను ఇంకా ప్రకటించలేదు.