
నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం గుడ్ న్యూస్ తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా మండుతున్న తరుణంలో ఎల్‌పీజీ బుకింగ్‌పై ఏకంగా రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ లేదా ఇండేన్ .. ఇలా ఏ కంపెనీ సిలిండర్ వాడుతున్నా, పేటీఎం ద్వారా బుక్ చేస్తే ఈ లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య గ్యాస్ ధరలు రూ.200 మేర పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు ఈ ఆఫర్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.
ఈ ఆఫర్ కింద ప్రతి 2,000వ వినియోగదారుడు రూ. 200 క్యాష్‌బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. క్యాష్‌బ్యాక్ నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే, మీ బ్యాంక్ అకౌంట్ పేటీఎంకు లింక్ అయి ఉండాలి. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. అలాగే ఒక్క యూజర్‌కు ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. కాగా గ్యాస్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో, బుకింగ్ చేసే ముందే యాప్‌లోని నిబంధనలను, మీకు వర్తించే క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి.