Sukanya Samriddhi: పెద్ద వయసు పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన వలన ప్రయోజనం ఉండదు.. ఎలాగంటే..

|

Aug 19, 2023 | 4:02 PM

చాలామంది పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ SSY లో ఇన్వెస్ట్మెంట్ అతని కూతురు నేహ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ అని సలహా ఇస్తున్నారు. అలాగే మరోవైపు సుకన్యం స్కీమ్‌లో 8% వడ్డీ అందిస్తోంది. ఇది అన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కన్నా ఎక్కువ వడ్డీ. ఇన్ని విషయాల మధ్యలో రాము ఈ స్కిమ్‌ని మించిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్ తన కూతురు కోసం లేదని కచ్చితంగా నమ్ముతున్నాడు. రాము అలా ఫిక్స్ అవడం సరైనదే.. కానీ అతని టైమింగ్ మాత్రం తప్పు అని చెప్పాలి..

Sukanya Samriddhi: పెద్ద వయసు పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన వలన ప్రయోజనం ఉండదు.. ఎలాగంటే..
Ssy Scheme
Follow us on

రాము సుకన్య సమృద్ధి యోజన అంటే SSYపథకం విషయంలో పూర్తి స్థాయిలో పాజిటివ్ గా ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే, చాలామంది పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ SSY లో ఇన్వెస్ట్మెంట్ అతని కూతురు నేహ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ అని సలహా ఇస్తున్నారు. అలాగే మరోవైపు సుకన్యం స్కీమ్‌లో 8% వడ్డీ అందిస్తోంది. ఇది అన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కన్నా ఎక్కువ వడ్డీ. ఇన్ని విషయాల మధ్యలో రాము ఈ స్కిమ్‌ని మించిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్ తన కూతురు కోసం లేదని కచ్చితంగా నమ్ముతున్నాడు. రాము అలా ఫిక్స్ అవడం సరైనదే.. కానీ అతని టైమింగ్ మాత్రం తప్పు అని చెప్పాలి.

దీనికి కారణం నేహాకు ఇప్పుడు పదేళ్లు. ఒకరికి ఎదిగిన కుమార్తె ఉంటే ఆమె చదువు కోసం ఎస్‌ఎస్‌వై ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం వలన ప్రయోజనం ఉండదు అని వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి చెబుతున్నారు. ఎందుకంటే ఈ పెట్టుబడులు మెచ్యూర్ అయ్యే సమయానికి ఆమె ప్రధాన చదువుల సమయం పూర్తి అయిపోతుంది. నేహా 1-2 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతను ఈ ఎకౌంట్‌ను తెరిచి ఉంటే అది మరింత ప్రయోజనకరంగా ఉండేది.

సుకన్య స్కీమ్‌ కింద మీరు మీ కుమార్తెకు 10 ఏళ్లు వచ్చే వరకు అకౌంట్ తెరవవచ్చు. పెట్టుబడులు 15 సంవత్సరాలు కొనసాగుతాయి. 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతాయి. రాము ఆగస్ట్ 2023లో నేహా కోసం అకౌంట్‌ తెరిస్తే అందులో 15 ఏళ్లు అంటే 2038 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్లు 2044లో అంటే 21 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతాయి. ఈ సమయానికి నేహాకు 31 సంవత్సరాలు, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆమె వయస్సు దాదాపుగా పూర్తి అయిపోయి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ స్కీమ్‌లో అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50%ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 2031లో నేహాకు 18 ఏళ్లు నిండినప్పుడు రాము అకౌంట్‌ నుంచి సగం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది ఆర్థికంగా ఆమె విద్యా లక్ష్యాలను నెరవేర్చడంలో పెద్దగా సహాయపడదు. అంతేకాకుండా, అతను దీర్ఘకాలిక పెట్టుబడిని మధ్యలో బ్రేక్ చేసినట్టు అవుతుంది. రాము తన 10 ఏళ్ల కుమార్తె కోసం స్కీమ్‌లో ఏటా రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అతను రూ. 11,48,000 పోగుచేస్తాడు. అతను మధ్యలో అంటే నేహాకు 18 ఏళ్ళు వచ్చినపుడు.. 50% అంటే రూ. 5,74,000 మాత్రమే విత్‌డ్రా చేయగలడు. అదే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ కాలపరిమితి తీరేవరకూ అంటే మేచ్యూరిటీ సమయం వరకూ అలాగే కొనసాగిస్తే రాము 21 సంవత్సరాల తర్వాత రూ. 46.53 లక్షల కార్పస్ కలిగి ఉండేవారు.

తన కూతురి ఉన్నత విద్యకు నిధులు సమకూర్చేందుకు రాము ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే అది మరింత మెరుగ్గా ఉంటుంది. నేహా ఉన్నత విద్యకు ఇంకా 10 సంవత్సరాలు మిగిలి ఉన్నందున, రాము సిప్‌ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ జితేంద్ర సోలంకి చెప్పారు. ఈ విధంగా, అతను సుకన్య సమృద్ది స్కీమ్‌ కంటే మెరుగైన రాబడిని సంపాదించవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల ద్వారా నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే, మనం దానిపై 12% వార్షిక రాబడిని ఊహించినట్లయితే, రాబోయే 8 సంవత్సరాలలో రూ. 16.15 లక్షలు రాబడి పొందవచ్చు.

ఎస్‌ఎస్‌వై 8 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా 8 సంవత్సరాలలో రూ.11,48,000 మాత్రమే సమకూరుతుంది. ఇందులో అతను 50% మాత్రమే ఉపసంహరించుకోగలడు. అయితే రాము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల ద్వారా రూ. 16.15 లక్షలను సేకరించవచ్చు. వాటిని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక కుటుంబం ఇద్దరు కుమార్తెల కోసం అకౌంట్స్‌ తెరవవచ్చు. ఒక కుటుంబానికి కవల కుమార్తెలు ఉంటే, వారు 3 అకౌంట్స్‌ను తెరవవచ్చు. మీరు పోస్టాఫీసులు, ప్రముఖ బ్యాంకులలో ఈ అకౌంట్‌ తెరవవచ్చు. మీరు కేవైసీ, ఓటర్ ఐడీ, కుమార్తె జనన ధృవీకరణ పత్రం కోసం ఆధార్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. నామమాత్రపు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా మీరు ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు సంవత్సరానికి కనీసం రూ. 250 పెట్టుబడి పెట్టాలి. మీరు సుకన్య స్కీమ్‌ ఖాతాలో సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి