Ola Scooters: రూపాయి ఖర్చులేకుండా స్కూటర్ ఇంటికి.. ఓలా ఆఫర్ అదిరింది.. పూర్తి వివరాలు ఇవి..

|

Jun 17, 2023 | 4:45 PM

ఓలా నుంచి అదిరే ఆఫర్ వచ్చింది. కొనుగోలు దారుల సౌకర్యార్థం ఓలా ఎస్ 1 స్కూటర్ల కొనుగోళ్లకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఓలా కంపెనీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Ola Scooters: రూపాయి ఖర్చులేకుండా స్కూటర్ ఇంటికి.. ఓలా ఆఫర్ అదిరింది.. పూర్తి వివరాలు ఇవి..
Ola S1 Pro Electric Scooter
Follow us on

ప్రస్తుత ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో టాప్ సెల్లర్ ఓలా ఎలక్ట్రిక్. మన దేశంలో టాప్ బ్రాండ్ గా ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అత్యధిక వాహనాలను విక్రయిస్తూ తన రికార్డులను తనే మార్చిరాసుకుంటోంది. అటువంటి ఓలా నుంచి అదిరే ఆఫర్ వచ్చింది. కొనుగోలు దారుల సౌకర్యార్థం 2 వాట్ల సెగ్మెంట్ లో ఓలా ఎస్ 1 స్కూటర్ల కొనుగోళ్లకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఓలా కంపెనీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సదుపాయంతో ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ లేకుండా 60 నెలల కాల వ్యవధికి కేవలం 6.99శాతం వడ్డీ రేటుతో స్కూటర్ కొనుగోలు చేసుకునే వెసులు బాటు కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అదే నినాదంతో..

దేశంలో విస్తృతంగా తనమార్కెట్ ను విస్తరించాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తోంది. అందులో భాగంగానే EndICEAge నినాదంతో ఈవీలను సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది. ఈ కొత్త ఫైనాన్సింగ్ సదుపాయంతో సేల్స్ గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తోంది.

ఈ సందర్భంగా ఓలా చీఫ్ బిజినెస్ అధికారి అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ మార్కెట్ లీడర్‌గా తాము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో పొత్తు ఏర్పరుచుకోవడం ద్వారా.. టైర్ 1 నగరాల్లోనే కాకుండా టైర్ 2, టైర్‌ 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఎంపికల ద్వారా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందిస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వినియోగం పెరుగుతోందని.. తమ ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తాయనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ ఫైనాన్సింగ్ సౌలభ్యంతో ఈవీని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఇప్పుడు ICE వాహనాన్ని కొనడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే సగం ఉంటుందని ఆయన చెబుతున్నారు.

పూర్తి వివరాలు కావాలంటే..

ఓలా యాప్ ద్వారా ఔత్సాహికులు ఈవీను కొనుగోలు చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లపై వివరణాత్మక సమాచారం కోసం తమ సమీప ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు వెళ్ళవచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఓలా ప్రస్తుతం 700+ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లతో భారతదేశపు అతిపెద్ద డీ2సీ ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఆగస్టులో 1000వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఓలా ఎస్1 ప్రో, ఎస్1, ఎస్1 ఎయిర్లతో కూడిన ఎస్1 లైనప్ అత్యాధునిక సాంకేతికతతో పాటు అసమానమైన పనితీరును కలిగి ఉన్నాయి. సొగసైన, మినిమలిస్ట్ డిజైన్‌ ఈ ఈవీలలో రూపొందించారు. ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలుగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ విభాగంలో అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..