Ola Electric Scooter: గుడ్‌న్యూస్‌.. కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.499తో బుక్ చేసుకోండిలా!

|

Jul 16, 2021 | 8:47 AM

Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సాధారణంగా ప్రతి ..

Ola Electric Scooter: గుడ్‌న్యూస్‌.. కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.499తో బుక్ చేసుకోండిలా!
Ola Electric Scooter
Follow us on

Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సాధారణంగా ప్రతి ఒక్కరికి ద్విచక్ర వాహనం ఉంటుంది. పెట్రోల్‌ ధర ఎంత పెరిగినా.. వాహనాలను రోడ్లపైకి తిప్పాల్సిందే. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాహన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ కొనే వారికి ఓలా శుభవార్త అందించింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్‌ను ప్రారంభించింది. అతి తక్కువ ధరతో మీరు ఈ స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కేవలం రూ.499తో బుక్ చేసుకోవచ్చు. ఇది రిఫండబుల్. ఉచితంగా బుకింగ్‌. దీనిని బుక్‌ చేసుకున్న వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ముందుగా డెలివరీ చేస్తారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి నిర్ధష్టమైన ధరలను వెల్లడిస్తామని ఓలా ఎల‌క్ట్రిక్ సీఈవో భావిష్ అగ‌ర్వాల్ తెలిపారు.

స్కూటర్‌ ప్రత్యేకతలు :

అయితే ఈ స్కూటర్‌లో పలు రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. కీ లేకుండానే స్కూటర్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మొబైల్ అప్లికేషన్ కూడా ఉండనుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్ దాదాపు 150 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. బ్యాటరీ ఫుల్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది. దేశవ్యాప్తంగా 400 పట్టణాల్లో హైపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఓలా ప్రకటించింది. అలాగే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఇకపోతే స్కూటర్ ధర ఎంతో రానున్న రోజుల్లో తెలియనుంది.

 

ఇవీ కూడా చదవండి:

Hero Bike: కేవలం నెలకు రూ.1794 చెల్లించి హీరో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.. 63 కిలోమీటర్ల మైలేజీ

WhatsApp Accounts Banned: కస్టమర్లకు షాకింగ్‌.. భారత్‌లో 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..!