OLA: కస్టమర్లకు గుడ్ న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ఓలా..

|

Nov 02, 2024 | 3:20 PM

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓలాపై పెద్ద ఎత్తున నెగిటివ్ రివ్యూలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ తమ సర్వీస్ సెంటర్లను పెంచనుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్లను పెంచనున్నట్లు ప్రకటించారు...

OLA: కస్టమర్లకు గుడ్ న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ఓలా..
Ola
Follow us on

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సంస్థ ఓలా ఇటీవల కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఓలా వాహన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఓలా సర్వీసింగ్ సెంటర్లు సరిపడ లేవని, కస్టమర్లకు సరైన సేవలు అందించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సమస్యకు పరిష్కారం చెప్పేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ తమ సర్వీస్‌ సెంటర్లను 30 శాతం మేర పెంచింది. కొత్తగా 50 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది టెక్నీషియన్లను నియమించుకున్నట్లు ఓలా తెలిపింది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తమ సర్వీస్‌ నెట్‌వర్క్‌ను 1,000 సెంటర్లకు పెంచుకోనున్నట్లు ఓలా వ్యవస్థాపకుడు, సీఎండీ భవీష్‌ అగర్వాల్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కంపెనీ కేంద్రాలను, శ్రామిక శక్తిని పెంచుకుంటోంది. సోషల్‌ మీడియా వేదికగా ఇటీవల ఓలాకు సంబంధించి నెగిటివ్ రివ్యూలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వీస్‌ సెంటర్లను పెంచుకునే పనిలో పడింది ఓలా. మార్కెట్‌లో తన ఉనికిని పెంచుకోవడంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఓలా హైపర్‌ సర్వీస్ క్యాంపెయిన్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఈఏడాది డిసెంబర్‌ నాటికి సర్వీస్ సెంటర్ల సంఖ్యను వెయ్యికి పెంచనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..