Ola Electric car: టెస్లాకు దీటుగా ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఆన్‌లైన్‌లో లీకైన చిత్రాలు ఇవే..

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు లవర్స్ ను ఓ వార్త షేక్ చేస్తోంది. అదేంటంటే ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని పేటెంట్ చిత్రాలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. ఇవి చూడటానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ లో ఉన్నాయి. గతంలో ఓలా విడుదల చేసి టీజర్ లో లాగానే కనిపిస్తున్నా.. కొన్ని మార్పులు ఉన్నాయి.

Ola Electric car: టెస్లాకు దీటుగా ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఆన్‌లైన్‌లో లీకైన చిత్రాలు ఇవే..
Ola New Electric Car

Updated on: Jun 18, 2023 | 5:00 PM

ఓలా ఎలక్ట్రిక్.. విద్యుత్ శ్రేణి వాహనాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు దుమ్మురేపుతోంది. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ దేశీయ స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. 2024లో ఈ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ లాంచ్ చేయనున్నట్లు గతేడాది ఆగస్టులో ఓలా ప్రకటించింది. అప్పటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు లవర్స్ ను ఓ వార్త షేక్ చేస్తోంది. అదేంటంటే ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని పేటెంట్ చిత్రాలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. ఇవి చూడటానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ లో ఉన్నాయి. గతంలో ఓలా విడుదల చేసి టీజర్ లో లాగానే కనిపిస్తున్నా.. కొన్ని మార్పులు ఉన్నాయి. దీంతో అవి విపరీతంగా షేర్ అవుతున్నాయి. అయితే చివరి ఉత్పత్తి దశకు వచ్చే సరికి కొన్ని మార్పులు వాటిల్లో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లీకైనా చిత్రం ఆధారంగా లుక్ ఇలా ఉంది..

ఓలా ఎలక్ట్రిక్ కారు సొగసైన, మినిమలిస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రదర్శిస్తుంది. ఇది ఐకానిక్ టెస్లా మోడల్ ఎస్, మోడల్ 3ని పోలి ఉంది. వాహనం వెనుక వైపున కూపే లాంటి రూఫ్‌లైన్‌తో సంప్రదాయ సెడాన్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. బాడీ ప్యానెల్‌లు గుండ్రని ఆకృతులు, మృదువైన గీతలను కలిగి ఉంటాయి. ఇవి మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యానికి దోహదం చేస్తాయి. ఈ కారు సాధారణ ఈవీ డిజైన్‌కు అనుగుణంగా, ఫ్రంట్ గ్రిల్ లేదు. దానికి బదులుగా, స్మూత్ ఫ్రంట్ బంపర్ ఫాసియాను ఏర్పాటు చేశారు. బంపర్‌కు ఎగువన హెడ్‌ల్యాంప్ అసెంబ్లీ ఉంది. వీటిలో ఎల్ఈడీ లైట్లు ఉండే అవకాశం ఉంది.

కారుని సైడ్ నుంచి చూసినప్పుడు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉన్న స్కూప్డ్ ఫ్రంట్ డోర్‌తో పాటు, ఫ్రంట్ ఫెండర్ వెనుక ఒక ఎయిర్ వెంట్ ఉంటుంది. ఈ కారులో సంప్రదాయ వింగ్ మిర్రర్‌లకు బదులుగా కెమెరాలను పొందుపరచవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో టీజర్లు ఇలా..

ఓలా గతంలో ఆన్‌లైన్ టీజర్‌ల శ్రేణిని విడుదల చేసింది. ఆ టీజర్లలో కారులోని వివిధ పార్టులను ఆవిష్కరించింది. వాటిల్లో ఇంటీరియర్ డిజైన్ తో పాటు పలు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆక్టాగోనల్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఎక్విప్పిడ్ విత్ హ్యాప్టిక్ కంట్రోల్స్, ఫ్రీ స్టాండింగ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ల్యాండ్ స్కేప్ టచ్ స్క్రీన్ వంటివి కూడా ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు ఇలా..

ఓలా ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్ల గురించి వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. అయితే మార్కెట్ వర్గాల ప్రకారం దీనిలో 70-80kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది సింగిల్ చార్జ్ పై 500కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. కేవలం నాలు సేకన్ల సమయంలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సహాయక డ్రైవింగ్ సామర్థ్యాలు, కీలెస్, హ్యాండిల్‌లెస్ డోర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ధర ఎంత ఉండొచ్చంటే..

2024లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25లక్షల నుంచి ప్రారంభం అవుతుందని చెబుతున్నారు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..