FASTag: ఫాస్టాగ్‌ ఉపయోగిస్తున్న వారికి అలర్ట్‌.. జనవరి 31 తర్వాత..

ఫాస్టాగ్‌కు కేవైసీని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లు జనవరి 31 తర్వాత పనిచేయవని అధికారులు చెబుతున్నారు...

FASTag: ఫాస్టాగ్‌ ఉపయోగిస్తున్న వారికి అలర్ట్‌.. జనవరి 31 తర్వాత..
Fastag

Updated on: Jan 15, 2024 | 8:35 PM

దేశవ్యాప్తంగా హైవేలపై టోల్‌ ఛార్జీల వసూలు కోసం కేంద్రం ఫాస్టాగ్‌ వ్యవస్థను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టోల్‌గేట్స్‌ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా క్యాష్‌లెస్‌ విధానంలో టోల్ చెల్లించే అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే ఫాస్టాగ్‌ల ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంఇ.

ఫాస్టాగ్‌కు కేవైసీని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లు జనవరి 31 తర్వాత పనిచేయవని అధికారులు చెబుతున్నారు. జనవరి 31, 2024 తర్వాత ఫాస్టాగ్‌లను బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఒకవేళ ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోయినా, కేవైసీ పూర్తి చేయకపోతే సేవలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు. నిరంతరాయం సేవలు కొనసాగాలంటే వెంటనే తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ పూర్తి చేసుకోవాలి అని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. కేవైసీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం సమీపంలోని టోల్‌ప్లాజాలు లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబర్‌లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాగే కొన్ని సందర్భాల్లో కైవేసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్‌లు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే వన్‌ వెహికిల్ వన్‌ ఫాస్టాగ్‌ విధానానికి చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..