క్రెడిట్ కార్డు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను అందిస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని రకాల క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి విమానాశ్రయాల్లో ప్రత్యేక లాంచ్‌లలో సేవలు అందిస్తుంటారు. ఇందులో భాగంగా అక్కడ ఉండే రకరకాల సేవలను ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా రూపే క్రెడిట్ కార్డు యూజర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది.
ఇటీవల రూపే కార్డుల వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీఐలో రూపే క్రెడిట్ కార్డులను యాడ్ చేసుకునే అవకాశం లభించడంతో వీటి వినియోగం ఎక్కుఐంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశంలోని పలు విమానాశ్రయాల్లో లాంజ్‌లు రూపే కార్డులు స్వీకరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 3లో రూపే మొదటి ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది.
రూపే కార్డు హోల్డర్‌లో విమానాశ్రయాలలో ఉన్న ప్రత్యేక రూపే లాంజ్‌లలో ఉండే ప్రత్యేక సౌకర్యాలు పొందొచ్చు. ఈ కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ3 డిపార్చర్ టెర్మినల్‌లో రూపే ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. బోర్డింగ్ గేట్ నంబర్ 41 వద్ద డిపార్చర్ పీర్ 11, టీ3డీ దగ్గర ఇది రూపే మొట్టమొదటి ప్రత్యేక లాంజ్. రూపే ప్రత్యేక లాంజ్ అనేక రకాల ఆహారం, డ్రింక్స్, వినోదాలు వంటి వాటిని పొందొచ్చు.
అయితే రూపే కార్డును ఉపయోగించే విధానం ఆధారంగా లాంజ్ యాక్సెస్ ఉంటుంది. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్‌ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ.లక్ష వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత యాక్సెస్ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అపరిమిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..