Kodak Smart Tv
Smart TV Offer: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టీవీలు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. రకరకలా ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ కూడా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఓ అద్భుత ఆఫర్‌ను తీసుకొచ్చింది. కొడాక్ 7ఎక్స్ ప్రో స్మార్ట్ టీవీపై మంచి ఆఫర్‌ను అందించింది. 43 ఇంచెస్ టీవీని కేవలం రూ. 11,499కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా పొందాలనేగా మీ సందేహం..
- ఈ స్మార్ట్ టీవీల అసలు ధర రూ. 28,999 కాగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌తో 23,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
- ఒకవేళ ఈ స్మార్ట్ టీవీని సిటీ బ్యాంక్‌కు చెందిన డెబిట్ కార్డు లేదా క్రెడిక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు ధరకు పొందొచ్చు. అంటే ఈ టీవీని రూ. 22,499కి సొంతం చేసుకోవచ్చు.
- ఈ టీవీపై ఆఫర్ ఇంతటితో ఆగలేదు. ఎక్సేంజ్‌పై భారీ తగ్గింపునుక అందిస్తోంది. మీపాత టీవీని ఎక్సేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు పూరి అర్హులైతే టీవీని రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చున్నమాట.
- ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఈ 43 ఇంచెస్ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ ఫాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- అల్ట్రా హెచ్‌డీ 4కే డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్ టీవీలో 3,840 x 2,160 పిక్సెల్‌ల రిజల్యూషన్ అందించారు. 24W సౌండ్ ఈ ఫోన్ సొంతం.
Also Read: Mahesh Babu: గురూజీ మాస్టర్ ప్లాన్.. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆ విలక్షణ నటుడు..
Summer Drinks: వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ 5 దేశీ డ్రింక్స్ సూపర్..!
Viral Video: తగ్గేదేలే.. చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్ చేస్తోన్న బుల్లి పప్పీ.. వైరలవుతోన్న వీడియో..